Site icon NTV Telugu

చెన్నమనేని కేసుపై తెలంగాణ హైకోర్టులో కీలక వాదనలు

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెన్నమనేని తరపున హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. సిటిజన్ షిప్ యాక్ట్‌పై ఆయన కోర్టుకు వివరణ ఇచ్చారు. పౌరసత్వం రద్దు చేయాల్సిన అధికారం సెక్రటరీ, బార్డర్ మేనేజ్మెంట్ మాత్రమే ఇవ్వాలని.. కానీ ఈ కేసులో అండర్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కోర్టుకు వివరించారు. ఇది చట్ట విరుద్ధమని వేదుల వెంకటరమణ కోర్టులో వాదించారు.

Read Also: ఫ్యాక్ట్ చెక్: డిసెంబర్ 31 వరకు భారత్ బంద్

సెక్షన్ 10,(2) ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పౌరసత్వం రద్దు చేసే అధికారాలున్నాయని న్యాయవాది వేదుల వెంకటరమణ తెలిపారు. కానీ పిటిషనర్‌కు అందులో ఉన్న ఏ అంశాలు కూడా వర్తించవన్నారు. చెన్నమనేని టెర్రరిస్ట్ కాదని, సంఘ విద్రోహ శక్తి కాదని సెక్షన్ 10(2) వర్తించదని స్పష్టం చేశారు. చెన్నమనేని సెక్షన్ 5 కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తులో ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వేదుల వెంకటరమణ కోర్టుకు వివరించారు.

ఈ సందర్భంగా ఓవర్ సిస్ ఇండియన్ (OCI) సిటిజన్‌కు భారత దేశంలో ఎమ్మెల్యే, ఎంపీగా ఫొటో చేసే అధికారం ఉంటుందా అని హైకోర్టు ప్రశ్నించింది. OCI మీద ఎలాంటి పోటీ చేసే అధికారం లేదన్న ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు కోర్టుకు తెలిపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చెన్నమనేని గెలిచారని న్యాయవాది వేదుల వెంకటరమణ గుర్తుచేశారు. నాలుగు సార్లు దురదృష్టవశాత్తు జర్మనీ పాస్‌పోర్టు మీద గెలిచారన్నా ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవి కిరణ్ రావు వాదించారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

Exit mobile version