NTV Telugu Site icon

Che Guevara: హైదరాబాద్ కు చేగువేరా కూతురు, మనవరాలు.. క్యూబా సంఘీభావ సభలో..

Che Guevara

Che Guevara

Che Guevara: విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డా.అలైదా గువేరా నేడు హైదరాబాద్ రానున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్టే ఫానియా గువేరా కూడా నగరానికి వస్తున్నారు. ఇవాళ (ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు అలైదా గువేరా, ఎస్టీ ఫానియా ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ, ఎంఐఎం మినహా ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చాలా దేశాలు క్యూబాకు మద్దతు ఇస్తున్నాయి. అందులో భాగంగానే క్యూబాకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సభకు చేగువేరా కూతురు, మనవరాలు వస్తున్నారు. వీరికి నాయకులు ఘనస్వాగతం పలకనున్నారు. క్యూబా సంఘీభావ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్ కుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని, తమ్మినేని, మాజీ ఎంపీ మల్లు రవి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల సభ్యులు పాల్గొంటారు.

Read also: Women IAS: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్.. కారణం ఇదీ..

ఈ సభను విజయవంతం చేయాలని క్యూబా తెలంగాణ కమిటీ కోఆర్డినేటర్లు బాలమల్లేష్, నరసింహారావులతో జాతీయ సంఘీభావ కమిటీ పిలుపునిచ్చారు. గురువారం మగ్ధుం భవన్‌లో ‘క్యూబా సంఘీభావ సభ’ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలని, చేగువేరా కుమార్తె, మనవరాలికి ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అలైదా, ఎస్తెఫానియా సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దుంభవన్‌కు వెళ్లనున్నారు. వీరి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సభ జరిగే రవీంద్రభారతి వద్ద పలుచోట్ల ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి. చేగువేరా ఫ్లెక్సీలతో పాటు ఆయన కూతురు, మనవరాలికి స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Telangana Congress: మూడోరోజు థాక్రే పర్యటన.. ఇవాళ్టి షెడ్యూల్‌ ఇదే..

Show comments