Chandrayanagutta Flyover: రాజాసింగ్‌ ఎఫెక్ట్‌తో వాయిదా.. ఇవాళే చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం

Chandrayanagutta Flyover

Chandrayanagutta Flyover

ముందుగా నిర్ణించిన ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ ఈ నెల 23వ తేదీనే ప్రారంభం కావాల్సింది ఉంది.. అయితే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎఫెక్ట్‌తో అవి చివరి నిమిషంలో వాయిదా వేశారు అధికారులు.. రాజాసింగ్ ఓ వీడియో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో.. దీంతో.. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాయిదా పడిన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఈరోజు ఉదయం 11 గంటలకు మంత్రి కేటీఆర్ లాంఛనంగా చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ ను ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొనే అవకాశం ఉంది.

Read Also: Ban Sale Of Petrol-Powered Cars: పెట్రోల్‌ కార్లపై నిషేధం..! ఎప్పటి నుంచి అమలంటే..?

×
×
Ad

కాగా, గతంలోనే చాంద్రాయణగుట్ట చౌరస్తాలో ఫ్లైఓవర్‌ ఉంది.. 2007లోనే ప్రారంభించారు. కానీ, కూడలిలో ట్రాఫిక్‌ కష్టాలు పెరుగుతోన్న దృష్ట్యా.. దానిని పొడిగించాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ… దానికి 2020లో శ్రీకారం చుట్టింది. 45.79 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనతో శంషాబాద్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వైపు మరింత వేగంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు ఈ పైవంతెన ఎంతో ఉపయోగపడనుంది.