Site icon NTV Telugu

ISB @20 Years: హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ద్విదశాబ్ది వేడుకలు.. ముఖ్య అతిథిగా చంద్రబాబు

Indian School Of Business

Indian School Of Business

ISB @20 Years:  నేడు దక్షిణ భారత దేశానికే హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థ తలమానికంగా నిలుస్తోంది. గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ) ప్రస్తుతం ద్విదశాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు. 1999లో ఐఎస్‌బీకి శంకుస్థాపన జరగ్గా 2001లో నాటి ప్రధాన మంత్రి వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పుడీ బిజినెస్ స్కూల్‌కు 20 ఏళ్లు పూర్తయ్యాయి.

Read Also: Best and Worst IPOs: 2022లో అత్యుత్తమ మరియు అతిచెత్త ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌లు

ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్న ద్విదశాబ్ది వేడుకలకు స్కూల్ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థ ఏర్పాటులో చంద్రబాబు కృషికి గుర్తింపుగానే ఈ ఆహ్వానం లభించినట్టు తెలుస్తోంది. కాగా వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు అనంతరం విద్యార్థులతో జరిగే మముఖిలోనూ పాల్గొంటారు. ఆనాడు ఐఎస్‌బీ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడినా ప్రతిష్టాత్మక సంస్థను నాడు రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కింది.

Exit mobile version