NTV Telugu Site icon

BRS Chalo Medigadda: నేడే చలో మేడిగడ్డ.. సిద్ధమైన బీఆర్‌ఎస్ నేతలు

Ktr

Ktr

BRS Chalo Medigadda: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు నేడు చలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డను సందర్శించి సమీక్షలు నిర్వహించి బీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే.. బీఆర్‌ఎస్‌ పర్యటనకు కూడా పిలుపునిచ్చారు. మార్చి 1న మేడిగడ్డకు.. నేడు ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క మేడిగడ్డనే కాదు, ఇతర బ్యారేజీలు, పంపుహౌజ్‌లు అంటూ కాంగ్రెస్ మాటలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ నేతలతో బయలుదేరి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజా ప్రతినిధులు. చలో మేడిగడ్డ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ దిశానిర్దేశం చేశారు.

Read also: Sreeleela: సినిమాలకు బ్రేక్ తీసుకోనున్న శ్రీలీలా..ఎందుకంటే?

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు తెలిసీ మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టును సజీవంగా చూపిస్తామని, అందుకే చలో మేడిగడ్డ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కాళేశ్వరం కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు మూడు బ్యారేజీల సమాహారం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల ఫ్లో కెనాల్స్‌ ఉన్నాయన్నారు. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 240 టీఎంసీల వినియోగం అని, వీటన్నింటికీ సమగ్ర రూపమే కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. చలో మేడిగడ్డ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నుంచి భూపాలపల్లి వరకు కొనసాగుతుందని కడియం శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం ఉదయం కరుణాపురం, ఆరెపల్లి, గూడెప్పాడు, పరకాల, భూపాలపల్లి మీదుగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌ రింగ్‌రోడ్డు మీదుగా మేడిగడ్డ వరకు కొనసాగుతామని బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు వరంగల్‌ సీపీ అంబర్‌ కిషోర్‌ ఝాకు వినతిపత్రం సమర్పించారు. సమగ్ర భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Read also: AP Inter Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు!

Show comments