Challa Harishankar: కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జాడ ఎక్కడ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి బాధ్యతలు చేపట్టిన ఉత్తంకుమార్ రెడ్డి ఒకేసారి కరీంనగర్ సందర్శించి పూలదండలు బొకేలు వేసుకొని జాడ లేకుండా పోయారంటూ ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంటూ వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాలను మొదలు పెట్టడం లేదన్నారు. రాబోయే వర్షాకాల సీజన్లో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఇన్చార్జి మంత్రిగా సమీక్ష సమావేశాలు లేవన్నారు. కరీంనగర్ నగర ప్రజలకు తాగునీరు రోజువారి వస్తుండే తాగునీరు ఒకరోజు తప్పి ఒకరోజు వస్తున్న ఇన్చార్జి మంత్రి ఇన్చార్జి చర్యలు లేవని తెలిపారు. కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వెంటనే జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై చర్యలు చేపట్టాలన్నారు.
Read also: NTR 31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఏకంగా అన్ని దేశాలలో జరగనుందా..?
కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన మంత్రిగా బాధ్యతలు చేపట్టి కరీంనగర్ గడ్డను ముద్దాడిన బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రధాని మోడీకి దగ్గరగా ఉంటారు.. కరీంనగర్ కు నిధులు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. కరీంనగర్ విచ్చేసి దేవాలయాలను సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ దేవాలయాల అభివృద్ధి కొరకు నిధులను తీసుకురావాలని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 18 లక్షల ఓటర్లకు 1% చొప్పున 18 వేల యువతకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో కేంద్రం నుంచి పెండింగ్ ఉన్న నిధులను మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు ఇవన్నీ పనులు చేసి కరీంనగర్ను అభివృద్ధి చేశానని చెప్పుకుంటే బాగుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి డిమాండ్ చేశారు.
Education Minister: నీట్ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదంటే..?