NTV Telugu Site icon

Chain Snatchers: వరుస చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు.. నగరంలో పోలీసుల తనిఖీలు..

Chain Snatchers

Chain Snatchers

Chain Snatchers: హైదరాబాద్‌ లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. చైన్‌ స్నాచింగ్‌ ఘటనలతో అప్రమత్తమయ్యారు రాష్ట్ర పోలీసులు. తెల్లవారు జామునుంచే స్నాచర్ల ఫోటోలతో రోడ్లపై పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. నిందితులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్‌, యూసఫ్‌ గూడ, అమీర్‌ పేట్ కెఎల్ఎమ్‌ షాపింగ్‌ మాల్‌, పంజాగుట్ట పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తు్న్నారు. మొత్తం 13 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా నాకాబంది నిర్వహిస్తున్న పోలీసులు. ఫోటోలోని చైన్స్ స్నాచింగ్ చోరీలకు పాల్పడే ముఠాగా పోలీసులు గుర్తించారు. ఈ ఫోటోలోని వ్యక్తులు ఎక్కడైనా తారసపడ్డ గుర్తించిన తక్షణమే డయల్ 100 కానీ.. స్థానిక పోలీసులకు గాని సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులు తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు గాను మిగతా గ్రూపుల్లో కూడా పోస్ట్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.

read also: Air India Urinating Case: ఫోన్ స్విచ్చాఫ్.. నిందితుడు మిశ్రా ఎలా చిక్కాడంటే?

సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హడల్ ఎత్తిస్తున్నారు. రోజుకో ప్రదేశం మార్చి మహిళలకు వనుకు పుట్టిస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది. గంటల వ్యవధిలో 6 చోట్ల చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చైన్‌ స్నాచింగ్‌ కేసులు ఎక్కవగా నార్సింగ్‌ లోనే నమోదు కావడం స్థానికులు గల్లీలో రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ హడలెత్తిస్తున్నాయి. గంటలోనే ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ లలో చైన్‌ స్నాచింగ్‌ జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నవారిని టార్గెట్‌ చేస్తూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చైన్‌ స్నాచింగ్‌ చేస్తూ కళ్లుమూసి తెరిచేలోగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

హైదరాబాద్ రాచకొండ పరిధిలో ఆరు చోట్ల స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులకు సవాల్‌ గా మారింది. ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో.. స్నాచర్స్ ను పట్టుకోవడానికి పోలీస్ బృందాలు రంగంలో దిగారు. హైదరాబాదులోని అన్నిచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల పట్టుదలచూస్తే ఇవాల స్నాచర్లను పట్టుకునే పనిలో పడ్డారనే తెలుస్తోంది. స్నాచర్లతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు మేమున్నాం మంటూ.. స్నాచర్లను పట్టుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఇవాల్టితో స్నాచర్ల పనికి చెక్‌ పెట్టేందుకు తనిఖీలు ముమ్మరంతోనే పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారో అర్థమవుతుంది. స్నాచర్లకు పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నగరంలో ఎక్కడ ఏం ఘటనలు తావులేకుండా ముందుకు సాగుతూ.. తక్షణమే చర్యలు తీసుకుంటున్న పోలీసులను చూసి సభాష్ పోలీస్ అంటున్నారు నగరప్రజలు.
Urfi Javed: నాకు బట్టలంటే ఎలర్జీ.. అందుకే వేసుకోకుండా తిరుగుతాను