సీపీఎం జాతీయ సమావేశాల్లో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీని విమర్శించారు. ఏడున్నర ఏళ్లలో బీజేపీ కార్పొరేట్ సంస్థలకు పెద్ద పీట వేసిందన్నారు. ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సేవకులు కనుమరుగు అవుతున్నారన్నారు. ప్రజాధనం లూటీ చేసే వాళ్లే రాజ్యం ఏలుతున్నారన్నారు. వామపక్షాలు బలహీన పడ్డాయి..అందుకే దేశంలో అరాచకం పెరిగిందని చాడా వ్యాఖ్యానించారు.
సీపీఐ, సీపీఎం భావసారుప్యత ఉన్న పార్టీలని చాడ అన్నారు. వామపక్షాల ఐక్యతే కాదు.. పునరేకీకరణ కూడా జరగాలన్నారు. రెండు లెఫ్ట్ పార్టీల జాతీయ నాయకులు అందుకు అడుగులు వేసే దిశగా చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో టీఆర్‌ఎస్ పట్ల లెఫ్ట్ పార్టీల విధానం ఒక్కటేనని స్పష్టం చేశారు. వామపక్షాలు ఎప్పటికీ ప్రజల పక్షాన్నే నిలబడుతుందన్నారు. సీట్లు లేకపోయినా క్రెడిబులీటీ ఉన్న పార్టీ మనది అని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మన ఐక్యతా పెంచుకుని.. పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. వర్గ పోరాటాలు మొదలు పెట్టాలని చాడ అన్నారు.
Read Also: ప్రజా ఉద్యమాలతోనే కేంద్రం దిగి వస్తుంది: సీతారాం ఏచూరి
రెండు రాష్ట్రాల్లో వనరులు దోపిడికి గురవుతున్నాయి: సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
సీపీఎం జాతీయ సమావేశాల్లో పాల్గొన్న సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో వనరులు దోపిడికి గురవుతున్నాయన్నారు. వామపక్షాలకు పూర్వ వైభవం రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కేంద్రంతో దోబూచులాటలు ఆడుతు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయన్నారు. పోరాటం చేయడమే మర్చిపోయరని ఆయన అన్నారు.
