Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jagtial Chada Venkat Reddy On Brs Party

Chada Venkat Reddy: బీఆర్ఎస్ విధివిధానాల్ని చెప్పాకే.. నిర్ణయం తీసుకుంటాం

Published Date :December 21, 2022 , 9:44 pm
By NTV WebDesk
Chada Venkat Reddy: బీఆర్ఎస్ విధివిధానాల్ని చెప్పాకే.. నిర్ణయం తీసుకుంటాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chada Venkat Reddy On BRS Party: బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలేంటో సీఎం కేసీఆర్ తమకు ఇంకా తెలియజేయలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ అవతరణ దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలను బట్టే తమ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు, కూలీలకు జరుగుతున్న అన్యాయంపై ఎవరు పోరాటం చేసినా సరే.. వాళ్లతో కలిసి తాము పని చేస్తామని, అందులో ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశఆరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇంతవరకు అర్హులైన వారికి ఇళ్లు, భూమి, పెన్షన్లు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోకముందే.. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు జెండాలు పాటి, ఆ స్థలాల్ని ఆక్రమించుకొని, గుడిసెలు నిర్మించుకోవాలని చాడ వెంకటరెడ్డి కోరారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ఇంకా అమలు కావట్లేదని, కనీస సౌకర్యాలైన విద్య, వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో.. వ్యవసాయంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పోరేట్ వ్యవస్థకు అప్పగిస్తున్నారన్నారు. జనవరి 26న హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తామన్న ఆయన.. ఈ నెల 29న బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS Party
  • Chada Venkat Reddy
  • CPI General Body Meeting
  • telangana farmers

తాజావార్తలు

  • Hyderabad: కష్టపడి సీఐని చేస్తే.. చావునే బహుమతిగా ఇచ్చింది! భార్య వేధింపులకు భర్త బలి..

  • CM Chandrababu: మంత్రులు, కలెక్టర్లు ఆటిట్యూడ్ మార్చుకోవాలి.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

  • Petrol, Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్రం కీలక ప్రకటన..

  • JAAT 2 : బాక్సాఫీస్ వద్ద మరో మాస్ జాతర.. బోయపాటి శ్రీనుతో ‘జాట్ 2’?

  • Farooq Abdullah: కాల్పులపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా.. ఏమన్నారంటే..!

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions