Central Ministers Telangana Tour: పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. నేటి నుంచి మూడు రోజుల పాటు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు బీజేపీ వెల్లడించింది. 3,4, తేదీల్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈపర్యటనలో భాగంగా పేద, బడుగు బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించడం సహా వారికి అందుతున్న విధానాన్ని కేంద్రమంత్రులు అడిగి తెలుసుకోనున్నారు.
ఈనేపథ్యంలో.. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల వినియోగం గురించి తెలుసుకోనున్నట్లు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో వివిధ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నట్లు ప్రకటించారు. ఇక ఆగస్టు 28, 29, 30 తేదీలలో కేంద్ర సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించగా.. ఆగస్టు 29 ,30 తేదీలలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో మరో సహాయ మంత్రి బీఎల్ వర్మ పర్యటించారు.
Teachers: స్కూళ్లలో నేటి నుంచి కొత్త విధానం.. లేట్ అయితే అంతే..!