TS Assembly Election: నేడు తెలంగాణ సీఈవోతో కేంద్ర ఎన్నికల బృందం భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Election: తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగానే నిన్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రానికి చేరుకుంది. నాలుగు రోజుల పాటు సీఈసీ బృందం హైదరాబాద్ లోనే మకాం వేసి కలెక్టర్లు, ఎస్పీలు, ఐటీ శాఖ అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. నేడు తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్‌తో భేటీ. రేపు కలెక్టర్లు, ఎస్పీలతో, 24న చీఫ్ సెక్రటరీతో సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసే చర్యలు, 2023లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తుంది.
Read also: Karnataka: తండ్రి పనిచేసిన అదే పోలీస్ స్టేషన్లో కూతురికి పోస్టింగ్..
Also Read
- Sanathnagar TIMS : సనత్‌నగర్ టిమ్స్ రెడీ.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం.!
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
డిసెంబర్లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ఉండే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5-15 మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీఈసీ అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. తెలంగాణకు రానున్న సీఈసీ బృందం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించి పలు కీలక సూచనలు చేయనున్నారు. ఈవీఎంల పరిశీలన, ఓటర్ల తుది జాబితా తయారీ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, డబ్బు పంపిణీని అరికట్టడం, ఎన్నికల సమయంలో కొట్లాటలు, దాడులు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై పోలీసు అధికారులతో చర్చించనున్నారు.
ఎన్నికల వేళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు విజయకేతనం ఎగురవేస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలు రచించడంలో స్పీడ్ పెంచారు. అధికారిక BRS కొత్త అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం మరియు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని, సర్వేల ఆధారంగా గెలిచే వారికే టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించింది. కానుగు సునీల్‌ని ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకుని టీ కాంగ్రెస్ సర్వేలు చేయిస్తోంది.
Health Tips : గర్భిణీలు చికెన్ ఎలా తినాలో తెలుసా?
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!