Central Budget-2024: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.47,65,768 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కొత్త పథకాలేవీ లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులను పరిశీలిస్తే రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా కింద రూ.25,639 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో తెలంగాణకు పన్నుల వాటా కింద రూ.23,400 కోట్లు కేటాయించారు. ఈసారి మరో రూ.2,239 కోట్లు పెరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.19,760.59 కోట్లు వస్తాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థల మంజూరు కింద రాష్ట్రానికి మరో రూ.3,200 కోట్లు రానున్నాయి. ఈ మూడు పెద్ద పద్దులు మినహా రాష్ట్రానికి ఈసారి చెప్పుకోదగ్గ కేటాయింపులు లేవు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద మూడేళ్లకు రూ.1800 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కూడా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గతంలో కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. దీన్ని అనుమతిస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయని భావిస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు, మెట్రో రైలు రెండో దశ, యాంటీ నార్కోటిక్ బ్యూరో పటిష్టతకు రూ.88 కోట్లు, సైబర్ సెక్యూరిటీ పటిష్టతకు రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలని కోరారు. బ్యూరో. కానీ, మధ్యంతర బడ్జెట్‌లో వీటికి కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు, భద్రత ప్రాజెక్టులకు ఈసారి రూ. 5071 కోట్లు కేటాయించారు. 2021-22 బడ్జెట్‌లో రూ. 2420 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రెండుసార్లు పెంచామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 109 శాతం పెరిగి రూ. 5071 కోట్లు అని ఆయన చెప్పారు. తెలంగాణలో 100 శాతం విద్యుదీకరణ పూర్తయిందని.. రాష్ట్రంలో రైల్వేలకు పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారని వెల్లడించారు.
Get to Gather: ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్