Site icon NTV Telugu

Ramoji Rao: రామోజీరావు మృతి పట్ల సినీ, రాజయకీయ ప్రముఖుల నివాళులు..

Ramoji Rao Enadu Chairmen

Ramoji Rao Enadu Chairmen

Ramoji Rao: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితుడు, మీడియా దిగ్గజం రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా ఉన్న రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రముఖలు రామోజీరావు మృతికి నివాళులు తెలియజేస్తున్నారు. ఆయన మృతిపట్లు దిగ్భ్రాంతి తెలిపారు.

Read also: Ramoji Rao: రామోజీరావు కోసం ఆస్కార్ రావాలని కోరుకున్న ఎం.ఎం.కీరవాణి.. ఎందుకో తెలుసా?

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ సంతాపాన్ని ప్రకటించింది. రామోజీరావు మరణంతో దేశం మీడియా లెజెండ్‌ను కోల్పోయింది. రామోజీ మృతితో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ దిగ్గజం కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’ అని అధ్యక్షుడు ముర్ము తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read also: Rajamouli: రామోజీరావు పార్థివదేహం వద్ద రాజమౌళి కంటతడి.. భారత రత్న ఇవ్వాలంటూ!

రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం దేశాభివృద్ధి కోసం ఆలోచించే రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదన్నారు. సినీ, మీడియా రంగాల్లో చెరగని ముద్ర వేశారని అభిప్రాయపడ్డారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని కొనియాడారు. కొత్త ప్రయోగాలు చేస్తూనే ప్రమాణాలతో నడిచే గొప్ప శక్తిగా అభివర్ణించారు. రామోజీరావు మృతి చాలా బాధాకరమని, భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు, జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంలో ఆయన చేసిన కృషి చెరగని ముద్ర వేసింది.తన సేవలతో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. రామోజీ రావు భారతదేశం యొక్క అభివృద్ధిపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు, ఈ క్లిష్ట సమయంలో అతని నుండి చాలా నేర్చుకోవాలి.

Read also: World Brain Tumor Day : నిర్లక్ష్యం చేస్తే నిండు ప్రాణాలు పోతాయి.. తస్మాత్ జాగ్రత్త

ఈనాడు అధి రామోజీరావు కోసం ఆస్కార్ రావాలని కోరుకున్న ఎం.ఎం.కీరవాణి.. ఎందుకో తెలుసా?నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రేవంత్ ట్వీట్ చేశారు. ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Read also: CM Revanth Reddy: అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం..

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత, మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రామోజీరావు తెలుగు వెలుగు. రామోజీ మృతి తీరని లోటు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీ అసామాన్య విజయాలు సాధించారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించాను. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు అని తీవ్ర ఆవేదిన వ్యక్తం చేశారు చంద్రబాబు..

Read also: Teacher Transfers: నేటి నుంచే టీచర్ల బదిలీలు.. పదోన్నతుల ప్రక్రియ కూడా..

ఈనాడు వ్యవస్థాపకులు, ఆత్మీయులు శ్రీ రామోజీరావు పరమపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనది. తెలుగు భాష-సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైనది. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా ఈనాడు పత్రిక మరియు రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు వారి ఘనతను చాటిన వారి క్రాంతదర్శనం స్ఫూర్తిదాయకమైనది. రామోజీ రావు గారు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ గర్వకారణమైన శ్రీరామోజీరావు గారు లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

Read also: Ramoji Film City: గిన్నీస్ బుక్లో రికార్డుల.. 2000 ఎకరాలు.. 2500 సినిమాలు.. రామోజీ ఫిలిం సిటీ గురించి మీకు ఇవి తెలుసా?

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మృతి పట్ల సీనియర్‌ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ సంతాపం తెలిపారు. సాధారణ వ్యక్తిగా కెరీర్ ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగారు. వారు జీవితాంతం కట్టుబడి మరియు క్రమశిక్షణతో ఉంటారు. ఏ పని చేపట్టినా నైతిక విలువలను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు తెలుగు జాతికి గర్వకారణం. యావత్ ప్రపంచానికి తెలుగు శక్తిని చాటిచెప్పిన రామోజీరావు చిరస్థాయిగా నిలిచిపోతారు. రామోజీరావుకు వామపక్ష భావజాలం ఉండేది. రామోజీ రావు మహనీయులు. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఈటల రాజేందర్ అన్నారు.

Read also: Myanmar Violence : ప్రజల శిరచ్ఛేదం, అగ్నిప్రమాదాలు, ఆహార సంక్షోభం…ఆందోళనకరంగా మయన్మార్ పరిస్థితి

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు అంటూ పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రశంసల వర్షం కురిపించిన ఒక పాత వీడియో వైరల్ అవుతుంది. ఆస్కార్ అందుకున్న తరువాత ఆయన కోసమైనా తనకు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకున్నానని కీరవాణి వెల్లడించారు. అప్పుడు అయన మాట్లడుతూ ఆస్కార్ అవార్డును అందుకునే విషయంలో తనకు ఏమీ ఎగ్జయిట్‌మెంట్ లేదని.. వస్తే చాలా మంచిదనే సదుద్దేశంతో ఉన్నానని తెలిపారు. ఎన్నో విపత్కర పరిస్థితులను జీవితంలో అనుభవించిన తనకు ఆస్కార్ అవార్డు అనేది పెద్ద ఎగ్జయిట్‌మెంట్‌ను ఇవ్వలేదని కూడా అప్పట్లో ఆయన అన్నారు.

Read also: Venkateshwara Parayanam: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల పాపాలు నశిస్తాయి

రామోజీ రావు మృతితో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.

Read also: Ramoji Rao: ప్రాంతీయ ఛానెళ్ల రారాజు.. రామోజీరావు గురించి ఆసక్తికర విషయాలు..

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకర మని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ అన్నారు. పత్రికా రంగంలో తనదైన పంథాతో చెరగని ముద్ర వేయడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు వరకు విశ్రమించని యోధుడు. మీడియా, వ్యాపార, సినీ రంగాల్లో అత్యద్బుతంగా రాణిస్తూ ఎంతో మందికి ’మార్గదర్శి’గా నిలిచిన మహనీయుడు. మీడియా మొఘల్ గా పేరుగాంచిన రామోజీరావుగారిని కలిసినప్పుడల్లా ఎన్నో గొప్ప విషయాలు చెప్పేవారు. అలాంటి వ్యక్తి మరణం తీరనిలోటు.రామోజీరావు గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ముందుకుసాగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా అన్నారు.

Read also: CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీతో భేటీ

రామోజీ రావు మరణం చాలా బాధాకరం.. నాకు రామోజీ రావు తో మంచి సాన్నిహిత్యం ఉండేదని వీ హనుమంతరావు అన్నారు. ఆయన ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. రామోజీ రావుకి సరైన గుర్తింపు దక్కాలి.. అతనికి దేశం గర్వించదగ్గ పురస్కారం దక్కాలన్నారు. ఆయన భారత దేశంలో మీడియా రంగానికి మంచి మార్గాన్ని చూపారన్నారు. భారత సినిమా చరిత్రలో రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు అనేది ఒక కీలకమైన నిర్ణయం అన్నారు. ఎన్నో వేల సినిమాలకు ఫిల్మ్ సిటీ వేదిక అయ్యిందని తెలిపారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.

Read also: Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఐఎండీ హెచ్చరిక

ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీ రావు మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (కేసీఆర్‌) సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థ వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. శోకతప్తులైన రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Ramoji Rao: మేరు పర్వతం .. దివి కేగింది.. రామోజీరావుకి చిరు, బాలయ్య అశ్రునివాళి

Exit mobile version