CBI Investigations: హైదరాబాద్ కేంద్రంగా ఐటీ అధికారులు పలుమార్లు దాడులు చేసిన నేపథ్యంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఐటీ దాడులపై ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. పాతబస్తీలోని ఆరు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. తాజాగా సదరు ఆటోమొబైల్ కంపెనీ కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించి సోదాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీ అజంపురాలోని డాక్టర్ అంజుమ్ సుల్తానా ఇంట్లో కూడా సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆమె భర్త ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు, లావాదేవీల వివరాలను రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Read also: Chain Snatchers: రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్.. గంటల వ్యవధిలోని ఆరు చోట్ల దోపిడి
కాగా..ఇటీవల హైదరాబాద్ లో మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటుగా, ఆయన వ్యాపార సంస్థలు, కళాశాలలపైనా ఐటి దాడులు కొనసాగాయి. ఏకంగా రెండు రోజుల పాటు జరిగిన ఐటి దాడులు తెలంగాణ రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించగా.. ఐటీ అధికారులు ఆపై మంత్రి మల్లారెడ్డి తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులను విచారించారు. కాగా.. ఈ తనిఖీలలో భారీ ఎత్తున నగదును బంగారు ఆభరణాలను సీజ్ చేసిన ఐటీ అధికారులు.. లెక్కల్లో చూపించిన 20 కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని కూడా సీజ్ చేశారు. అయితే ఇక అంతకు ముందు మంత్రి గంగుల కమలాకర్, టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి ఇళ్ళు, ఆఫీసులలో కూడా ఐటి దాడులు కొనసాగాయి. అంతేకాకుండా.. వంశీ రామ్ బిల్డర్స్ పైన కూడా ఐటీ దాడులు నిర్వహించారు.. దీంతో వరుసగా చోటుచేసుకుంటున్న ఐటీ దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. ఐటీ సోదాలు దేనికి సంబంధించి జరుగుతున్నాయి? ఎవరిని టార్గెట్ చేశారో అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Narsingi Robbery Case: నార్సింగి దారి దోపిడీ కేసు.. వెలుగులోకి వస్తున్న కరణ్‌సింగ్ ఆగడాలు