Site icon NTV Telugu

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మరో కీలక వ్యక్తి అరెస్టు

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈయన గతంలో ప్రముఖుల వద్ద సీఏగా పనిచేశారు. అతడి అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. రామచంద్ర పిళ్లై వద్ద చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడు. ఈ కేసులో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. అంతకుముందు అతని ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ, అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు బుచ్చిబాబు పాత్ర ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. అందుకే ఈ తెల్లవారుజామున బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టుకు ముందు పలుమార్లు ఢిల్లీకి పిలిపించి విచారించారు కూడా. అయితే.. అరెస్టయిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు రోస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆపై విచారణ కోసం కస్టడీ కోరే అవకాశాలున్నాయి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం లో మరొకరిని అరెస్ట్ చేశారు. గౌతమ్ మల్హోత్రాను ఈడి అధికారులు అదుపులో తీసుకున్నారు.

Read also: Revanth Reddy: ప్రగతిభవన్‌ వాఖ్యలపై రేవంత్‌ స్పందన.. కేసులకు భయపడను కొత్త ఏమి కాదు

రామచంద్ర పిల్లి వద్ద చార్టెడ్ అకౌంట్ గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు గతంలో కూడా పలు ప్రముఖుల వద్ద వద్ద సీఏగా పనిచేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో కొన్ని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్నందున గతేడాది సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా నలభై చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో దోమలగూడ అరవింద్ నగర్‌లోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీ మొదటి అంతస్తులో ఉన్న బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. గోరంట్ల అసోసియేట్స్ ఆఫీసులో ఈ దాడులు జరగడం సరికొత్త అనుమానాలకు దారి తీసింది. అప్పట్లో బుచ్చిబాబు పలు ప్రముఖులతో దిగిన ఫొటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తుల పేర్లను ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో ఇడి దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను రూస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిశీలించి నిందితులకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో చార్జిషీట్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురి ప్రముఖుల పేర్లు కూడా ఉండటం హాట్‌ టాపిక్‌ గా మారింది.
Woman trap: బాలికపై మరో మహిళ ట్రాప్.. యువకులకు అప్పగించి దారుణం

Exit mobile version