NTV Telugu Site icon

Mahaboobnagar: మహబూబ్‌ నగర్‌ లో చికెన్‌ గున్యా కేసులు.. భయాందోళనలో ప్రజలు

Mahabobnagar

Mahabobnagar

Mahaboobnagar: చికెన్ గున్యా కేసులు నగరంలో వేగంగా పెరుగుతున్నాయి. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల కారణంగా ఈ అంటువ్యాధుల కేసులు ప్రబలుతున్నాయి చికెన్ గున్యా పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ పేర్కొంది. అకాల వర్షాలకు మళ్ళీ చికెన్ గున్యా కోరలు చాచుతుంది. చికెన్ గున్యా వ్యాధితో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. చికెన్ గున్యా కేసులు ఎక్కువగా మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చోటుచేసుకోవడం కలకలం రేపుతుంది. విష జ్వరాలతో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఆస్పత్రిలో సాధారణం కంటే.. ఎక్కువగా కేసులు నమోదవుతూ.. రోగులు కిక్కిరిసి పోతున్న పరిస్థితి ఆందోలనకు గురి చేస్తుంది. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగుల సంఖ్య 60 వరకు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. చికెన్‌ గున్యాతో సంబంధించిన కేసులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో పెరిగిపోతున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది.

Read also: HIV-positive: హెచ్ఐవీ ఉందని తెలిసి కూడా 200 మందితో సంబంధం పెట్టుకున్న మహిళ..

మహబూబ్ నగర్ జిల్లాలో మిడ్జిల్ లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లో చికెన్ గున్యా బాధితులు ఉండటం భయాందోళనకు గురిచేస్తుంది. చికెన్‌ గున్యా కేసులు ఎక్కవగా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో పెద్దలక కన్నా చిన్న పిల్లలు చికెన్‌ గున్యా బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. విపరీతమైన తల నొప్పి, కండరాల నొప్పులు, పెద్ద సంఖ్యలో జ్వరాలు బారిన పడుతున్నారు. ఇంటి ముందు బురదలు దాని వల్ల దోమలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. అకాల వర్షాలతో వాతావరణ మార్పు రావడం జ్వరాలకు మరో కారణం అంటున్నారు వైద్యులు. జ్వరం రావడంతో డోలో ఏదో ఒక మాత్రలు వాడుతున్నారని, ఆ తరువాత నరాల నొప్పులు ఎక్కువ కావడంతో ఆసుపత్రులకు పరుగులు పెట్టే పరిస్థితులు ఎదురవుతున్నాయి. చికెన్ గున్యా బారిన పడుతున్న వారు ఎక్కువగా మిడ్జిల్‌ ప్రాంత వాసులే కావడం విశేషం. దీంతో వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. వారిని నుంచి శ్యాంపిల్స్ సేకరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అజాగ్రత్తగా ఉండకూడదని తెలిపారు.
AP Violence: చంద్రగిరిలో హింసాత్మక ఘటనలపై పోలీసులు అలెర్ట్