Mahaboobnagar: మహబూబ్ నగర్ లో చికెన్ గున్యా కేసులు.. భయాందోళనలో ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahaboobnagar: చికెన్ గున్యా కేసులు నగరంలో వేగంగా పెరుగుతున్నాయి. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల కారణంగా ఈ అంటువ్యాధుల కేసులు ప్రబలుతున్నాయి చికెన్ గున్యా పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ పేర్కొంది. అకాల వర్షాలకు మళ్ళీ చికెన్ గున్యా కోరలు చాచుతుంది. చికెన్ గున్యా వ్యాధితో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. చికెన్ గున్యా కేసులు ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకోవడం కలకలం రేపుతుంది. విష జ్వరాలతో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఆస్పత్రిలో సాధారణం కంటే.. ఎక్కువగా కేసులు నమోదవుతూ.. రోగులు కిక్కిరిసి పోతున్న పరిస్థితి ఆందోలనకు గురి చేస్తుంది. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగుల సంఖ్య 60 వరకు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. చికెన్ గున్యాతో సంబంధించిన కేసులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో పెరిగిపోతున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది.
Read also: HIV-positive: హెచ్ఐవీ ఉందని తెలిసి కూడా 200 మందితో సంబంధం పెట్టుకున్న మహిళ..
Also Read
మహబూబ్ నగర్ జిల్లాలో మిడ్జిల్ లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లో చికెన్ గున్యా బాధితులు ఉండటం భయాందోళనకు గురిచేస్తుంది. చికెన్ గున్యా కేసులు ఎక్కవగా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో పెద్దలక కన్నా చిన్న పిల్లలు చికెన్ గున్యా బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. విపరీతమైన తల నొప్పి, కండరాల నొప్పులు, పెద్ద సంఖ్యలో జ్వరాలు బారిన పడుతున్నారు. ఇంటి ముందు బురదలు దాని వల్ల దోమలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. అకాల వర్షాలతో వాతావరణ మార్పు రావడం జ్వరాలకు మరో కారణం అంటున్నారు వైద్యులు. జ్వరం రావడంతో డోలో ఏదో ఒక మాత్రలు వాడుతున్నారని, ఆ తరువాత నరాల నొప్పులు ఎక్కువ కావడంతో ఆసుపత్రులకు పరుగులు పెట్టే పరిస్థితులు ఎదురవుతున్నాయి. చికెన్ గున్యా బారిన పడుతున్న వారు ఎక్కువగా మిడ్జిల్ ప్రాంత వాసులే కావడం విశేషం. దీంతో వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. వారిని నుంచి శ్యాంపిల్స్ సేకరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అజాగ్రత్తగా ఉండకూడదని తెలిపారు.
AP Violence: చంద్రగిరిలో హింసాత్మక ఘటనలపై పోలీసులు అలెర్ట్
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!