NTV Telugu Site icon

Patnam Mahender Reddy: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీపై కేసు నమోదు

Patnam Mahender Reddy

Patnam Mahender Reddy

టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇన్స్పెక్టర్‌ను అసభ్యకరంగా దూషించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. అధికార పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన మహేందర్ రెడ్డిపై 353, 504,506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు..

Read Also:Munnur Ravi: టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కలకలం.. మున్నూరు రవి ప్రత్యక్షం..

కాగా, తాండూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా రథోత్సవం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు… ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా? రా లం… కొడకా..! నీ అంతు చూస్తా..! అని వార్నింగ్‌ ఇచ్చారు. పద్ధతిగా మాట్లాడాలని సీఐ వారిస్తుంటే.. రికార్డు చేసుకో.. మీడియాకు ఇచ్చుకో.. నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు.. ఎమ్మెల్యే రౌడీషీటరా? అని సీఐ ప్రశ్నించగా.. వాడి పక్కన రౌడీషీటర్లు లేరారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఇసుక దందాలో నీ ప్రమేయం లేదా? ఇప్పటినుంచి నీ అంతు చూస్తా అంటూ ఫోన్‌లో సీఐ రాజేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు.. ఆ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోగా… చివరకు కేసు నమోదు చేశారు పోలీసులు.