Breaking : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్నీసియా పబ్ అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో నిందుతులపై త్వరగా పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిందితులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మీడియాకు చూపారు. అయితే ఈ ఘటనలో మైనర్లు ఉన్నారని.. వారికి సంబంధించిన ఫోటోలో, వీడియోలు ఎలా చూపిస్తారంటూ రఘునందన్ రావుపై విమర్శలు గుప్పుమన్నాయి. దీనిపై స్పందించిన రఘునందన్ నేను ఎవరీ పేరును ప్రస్తావించలేదని, ఎవరి ముఖం కనిపించేవిధంగా ఫోటోలు, వీడియోలు విడుదల చేయలేదన్నారు.
అంతేకాకుండా తన కంటే ముందే టీవీల్లో వీడియోలు వచ్చాయన్నారు రఘునందన్. అయితే ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. మైనర్ బాలిక ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయడం పై ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 228A కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అబిడ్స్ పోలీసులు తెలిపారు.
Also Read
ఇదిలా ఉంటే.. అత్యాచారాలు జరగానికి పబ్‌లే కారణమంటూ.. ఎన్ఎస్యూఏ నేత బల్మూరి వెంకట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని పబ్‌లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా పబ్ సమయానికి మించి నడుపుతున్నారని బల్మూరి వెంకట్ పబ్‌లో వీరంగం సృష్టించారు. అయితే.. ప్రభుత్వ అనుమతులు ఉన్న బార్లను మూసివేయాలంటూ నిర్వాహకులను బెదిరించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసినట్లు బల్మూరి వెంకట్‌పై శంషాబాద్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!