Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నీటి కోసం ఏపీ, తెలంగాణ పోలీసుల వివాదం తారాస్థాయి చేరుతున్నాయి. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులతో పాటు రాష్ట్రంలోని నీటిపారుదల అధికారులపై తెలంగాణ ఎస్పీఎఫ్‌ను ప్రయోగించారు. అర్థరాత్రి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, ఏపీ పోలీసులు అనుమతి లేకుండా డ్యాం వద్దకు వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇక మరోవైపు నాగార్జున సాగర్ ప్రధాన డ్యామ్ వద్దకు కృష్ణా రివర్ బోర్డు అధికారులు చేరుకున్నారు. డ్యాంపై 13వ గేట్ దగ్గర ఏపీ, తెలంగాణ అధికారుల చర్చలు జరుగుతున్నాయి.
Read also: Telangana Election: ఏంటీ.. ఈ ఊళ్లో పోలింగ్ జరగలేదా? మరీ..!
నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర రెండో రోజు కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు ముళ్ల కంచెల మధ్య సాగర్ డ్యామ్ వద్ద పహారా కొనసాగిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ వైపు భారీగా పోలీసులు మోహరించారు. నిన్న మధ్యాహ్నం ఏపీ అధికారులు కుడి కాల్వకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర పరిస్థితిపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి. ఏపీ పోలీసుల దాడిలో గాయపడిన కానిస్టేబుళ్ల పరిస్థితి, ధ్వంసమైన సీసీ కెమెరాలను స్మితా సబర్వాల్ పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఇరు రాష్ట్రాల ఐజీ స్థాయి అధికారులు పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉంది.
Strong Rooms: స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు..