Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jangaon Case Against Janagama Mla Muthireddy Daughter Tulja Bhavani

Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తెపై కేసు..

Published Date :June 27, 2023 , 9:29 am
By NTV WebDesk
Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తెపై కేసు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కుమార్తె తుల్జా భవానీరెడ్డి మధ్య భూ వివాదం మరో మలుపు తిరిగింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతరుపై కేసు నమోదు చేశారు చేర్యాల పోలీసులు. గత కొంతకాలంగా చేర్యాలలో భూమికి సంబంధించి తుల్జాభవానికీ తండ్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వివాదం నడుస్తోంది. రెండు రోజుల క్రితం మత్తడి ఆవరణ స్థలంలో 1270 గజాల స్థలం చుట్టు ఉన్న ఫెన్సింగ్ ను తుల్జాభవాని రెడ్డి కూల్చివేశారు. తన భూమి మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగించనున్నట్లు సోమవారం ప్రకటించారు. సోమవారం ఉదయం చేర్యాలలో తన పేరుమీదున్న భూమి చూట్టూ వేసిన ప్రహరీగోడను కూల్చేశారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న తన భూమి ఫెన్సింగ్ ను కూడా తుల్జా భవాని కూల్చేసిందని పక్కనే ఉన్న స్థల యజమాని రాజు భాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె మీద చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తన తండ్రే అతనితో కేసు పెట్టించాడని తుల్జా భవానీ రెడ్డి ఆరోపిస్తున్నారు.

Read also: Traffic Rules Challan: డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఇలా పట్టుబడితే.. 15వేల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష!

మరోవైపు సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి భూమిని తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఆరోపించారు. ఆదివారం (25)న ఉదయం చేర్యాలకు చేరుకున్న తుల్జా భవానిరెడ్డి తన పేరుతో ఉన్న భూమి చుట్టూ ఉన్న కంచెను కూల్చివేసారు. అయితే పేరు మీద ఉన్న భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానిరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. గ్రామ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు తన తండ్రిని క్షమించాలని తుల్జా భవాని గ్రామస్తులను కోరింది. ఊరి భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు తండ్రిని క్షమించాలని బోర్డు కూడా పెట్టింది.

ఈ స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీలో త్వరలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి గొడవలు జరగకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇస్తానని తుల్జా భావన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నకు 70 ఏళ్లు.. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.. ఎమ్మెల్యే కాకముందు వెయ్యి కోట్ల ఆస్తి ఉండేవారు.. అలాంటి వాడు ఇలాంటి పనులు చేయకూడదు.. చెరువు భూమి నా పేరు మీద రిజిష్టర్ చేశారు.. అది.. తప్పు జరిగిందా..క్షమించండి..అని ప్రశ్నించారు.మళ్లీ ఆ భూమిని చేర్యాల మున్సిపాలిటీకి తన పేరు మీద రాసిస్తున్నాను.ఇదిలా ఉండగా జనగామలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని భవానీ బహిరంగంగా నిలదీసిన విషయం చర్చనీయాంశకంగా మారింది.
Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ. 950 కోట్ల డ్రగ్స్ ధ్వంసం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS MLA Muthireddy
  • BRS MLA Muthireddy daughter Bhavani
  • Case against
  • Janagama MLA Muthireddy daughter
  • MLA Muthireddy daughter Tulja Bhavani

తాజావార్తలు

  • Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్‌ హిట్టింగ్‌.. అభిషేక్‌ శర్మ నయా హిస్టరీ!

  • Pawan Kalyan: పవన్ విడాకులపై స్టాండప్ కమెడియన్ దారుణ కామెంట్స్… ఫ్యాన్స్ ఫైర్!

  • Iran Ship Tax: హోర్ముజ్ జలసంధిలో నయా వార్.. ఇరాన్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న ఈయూ, అరబ్ దేశాలు!

  • Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్‌ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!

  • US-Iran War: యుద్ధం మళ్లీ మొదలవుతుందా.? ఇరాన్‌‌కు చైనా నుంచి అత్యాధునిక ఆయుధాలు..

ట్రెండింగ్‌

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions