NTV Telugu Site icon

Jubilee Hills Crime: అమ్మాయిలతో కలిసి కారులో షికారు.. మత్తులో ఉండటంతో షాకింగ్ ఘటన

Jublihils Crime

Jublihils Crime

Jubilee Hills Crime: మద్యం మత్తులో యువకులు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ఎన్ని సార్లు చెబుతున్నా.. ఆమాటలను బేఖాతరు చేస్తున్నారు మందుబాబులు. దీని ప్రభావం ప్రాణాలు కోల్పోవడం.. ప్రమాదాలకు గురికావడంతో కుటుంబాలకు తీరని సోకాన్ని మిగిలిస్తున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలియని పరిస్థిలో వారు ఎలాంటి ప్రమాదాలకు గురికావాల్సి వస్తుందో కూడా మద్యం బాబులకు తెలియడం లేదు. ఇక వీకెండ్‌ వచ్చిందంటే ఫుల్‌ గా మద్యం సేవించి చిల్‌ కోసం వాహనాలు నడపడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఇలాంటి ప్రమాదాలతో గాయాలు కావడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నా అవన్నీ పక్కన పెట్టి ఆనందం కోసం, ఆహ్లాదం కోసం వాహనాలు వేగంగా నడపడంవల్ల ప్రమాదాలకు గురికాడం జరుగుతుంది. ఇలాంటి ఘటనే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో జరిగింది. కానీ ఇక్కడ యువకులు కాదండోయ్ యువతులు మద్యం సేవించి కారు నడపడం తీవ్ర కలకలం రేపుంతుంది.

Read also: Divyansha Kaushik: ఐ లవ్ నాగచైతన్య.. బాంబ్ పేల్చిన ‘మజిలీ’ బ్యూటీ

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ సమీపంలో కారు భీభత్సం సృష్టించింది. కారులో యువతులు ఎంజాయ్‌ చేస్తూ ఏంచేస్తున్నారో వారికే అర్థం కాలేదు. కారును అతివేగంగా నడపడం మొదలు పెట్టారు. కానీ కారు నడుపుతున్న యువతి మద్యం సేవించి మైకంలో ఉండటం.. మై మరిచిపోయి కారును వేగంగా నడుపుతున్నా కారులో మిగతావారు కూడా అస్సలు పట్టించుకోలేదు. వారు కూడా ఆయువతి వేగంగా నడుపుతున్నా ఎంజాయ్‌ చేశారు. తెల్లవారుజామున చిల్‌ ఉంది అంటూ ఆనందంగా గడుపుతున్నాము అనుకునే లోపే పెద్ద సబ్దం రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతలోనే అనుకోణి ప్రమాదం. అసలేం జరుగుతుంది అనుకునే లోపే.. అరుపులతో కాసేపు ఆప్రాంతమంతా దద్దరిల్లింది. కారు ప్రమాదానికి గురైంది. మద్యం మత్తులో వున్న యువతి కారును అతివేగంగా ఎదురుగా వున్న డివైడర్‌ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి దూసుకువస్తుండటంతో భయంతో జనం పరుగులు తీసారు. కారులో వున్న వారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎక్కడ పోలీసులకు చిక్కుతామో అనుకున్నారో ఏమో గానీ కారుదిగి ఎవరికి వారు అబ్బాయిలు, అమ్మాయిలు పరుగులు తీసారు. అందులో వున్నవారు ఎవరు? ఎంతమంది ఉన్నారు? అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు క్రేన్ సాయంతో కారును తొలగించారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని అలర్ట్‌ గా ఉండాలని సూచించారు.
Bus Accident: లోయలో పడిన బస్సు.. 24 మంది దుర్మరణం

Show comments