Site icon NTV Telugu

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. ఆ ఎమ్మెల్యేదేనా..?

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రాత్రి కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 1 వైపు వెళ్తున్న మహేంద్ర థార్ కారు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 45లో బ్రిడ్జి దిగి కొంతదూరం వెళ్లగానే రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నరేళ్ల బాలుడు కిందపడిపోయింది.. తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ఆ బాలుడు కన్నుమూశారు.. ఈ ప్రమాదంలో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది.. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సదరు మహిళను ఆస్పత్రికి తరలించారు.. ఇక, కారు నడిపిన వ్యక్తి ఘటనా స్థలంలోనే కారును వదిలి పారిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.. మరోవైపు కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Astrology: మార్చి 18, శుక్రవారం దినఫలాలు

ఇక, ఈ ప్రమాదంపై స్పందించారు బోధన్ ఎమ్మెల్యే షకీల్.. ప్రమాదం విషయం నా దృష్టికి వచ్చిందన్న ఆయన.. ఆ కారుకు, ఆ ప్రమాదానికి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నేను ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాను.. అయితే, తాను మీర్జా అనే ఫ్రెండ్‌కు స్టిక్కర్ ఇచ్చానని.. అది అతనికి సంబంధించిన కారుగా వెల్లడించారు. ఒక మహిళా యాచకురాలు అకస్మాత్తుగా పరిగెట్టడం వల్లనే యాక్సిడెంట్ అయిందని నాకు తెలిసిందన్న ఆయన.. పోలీసులు ఇది ప్రమాదమా, నిర్లక్ష్యం వలన జరిగిందా అనేది దర్యాప్తు చేయాలని కోరారు.. సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజం తెలస్తుందని సూచించిన ఎమ్మెల్యే షకీల్.. నేను దుబాయ్‌లో ఉన్నాను, వివరాలు కనుకుంటున్నాని తెలిపారు.

Exit mobile version