Bandi Sanjay: ఈ పాదయాత్రలో కొన్ని గ్రామాలకు రాలేకపోతున్నా… మళ్లీ తప్పకుండా వస్తా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. నిర్మల్ జిల్లాలో 8వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న కనకాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు బండి సంజయ్. కేసీఆర్ ను గద్దె దింపుడే అంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని మండిపడ్డారు. 57 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పై అసమ్మతితో ఉన్నట్టు ఆయనే చెప్పుకున్నాడని ఎద్దేవ చేశారు. బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా? అని ప్రశ్నించారు. సంతలో పశువుల్లా 37 మంది ఎమ్మెల్యేలను కొన్నోడే కేసీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాత్రమే నీతిమంతుడట అంటూ హాస్యాస్పదం చేశారు. కేసీఆర్ చేస్తే సంసారం… ఇతరులు చేస్తే వ్యభిచారమా? అంటూ నిప్పులు చెరిగారు.
Read also: PM Anthony Albanese: మరోసారి ఆ దేశ ప్రధానికి కరోనా పాజిటివ్..
కేసీఆర్ బిడ్డ సారా (లిక్కర్) దందా చేసిందని, లక్ష కోట్లు పెట్టి, ఢిల్లీకి పోయి దొంగ సార దందా చేశారన్నారు. దొంగ దందాలు చేసిన వాళ్ళని గుంజుక పోవాల్నా… వద్దా…? అని ప్రశ్నించారు. కవితను అరెస్టు చేస్తే మన తెలంగాణ బిడ్డను అరెస్టు చేసినట్టు, తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని ఆరోపించారు. బెంగళూరు డ్రగ్స్ కేసును కూడా బయటికి తీస్తున్నామని తెలిపారు. క్లోజ్ చేసిన బెంగళూరు డ్రగ్స్ కేసును మళ్లీ రీ ఓపెన్ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసును కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. దమ్ముంటే.. డ్రగ్స్, క్యాసినో, లిక్కర్ దందాలో విచారణకు హాజరై, తమ నిజాయితీ ఏంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అన్నీ కాంట్రాక్టులు దోపిడీలు టీఆర్ఎస్ వాళ్ళవే అని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేసిండని ఆరోపించారు. తెలంగాణ అమరవీరులు కేసీఆర్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? ఇన్ని రోజులు కేసీఆర్ కు అమరవీరులు ఎందుకు గుర్తుకు రాలేదు? అని ప్రశ్నించారు.
Read also: Hanu Man: చిన్న సినిమా రేంజ్ పెరుగుతోంది…
డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ హామీలు ఏమయ్యాయి? ఇక్కడ ఎంత మందికి 2bhk ఇచ్చిండు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే అని బండి సంజయ్ తెలిపారు. ఒక్క ఎకరానికి. ఒక్క పంటకు.. రైతుకు సబ్సిడీపై 30 వేల రూపాయలను మోడీ ఇస్తున్నారని తెలిపారు. ‘రైతు సమ్మాన్ నిధి’ కింద రైతులకు పైసలిస్తున్నామన్నారు. దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ఇక్కడ మంత్రి, అతని అల్లుడు కబ్జాలకు… అంతే లేదని అన్నారు. మంత్రి పై విచారణ జరపాల్సిందే, విడిచిపెట్టే ప్రసక్తే లేదని డిమాండ్ చేశారు. రోజుకు లక్ష రూపాయలు పోలీసులు ఛానాళ్ల పేరు మీద వసూలు చేయాలంట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా అన్నారు. వైన్ షాప్ ల నుంచి కేసీఆర్ కు, నీకు కమిషన్ లు పోతాయని ఆరోపించారు.
Read also: Bandi Sanjay: ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే..
డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో… ఎక్కడ నిర్వహిస్తున్నారో… ఎవరిని బాలి చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారన్నారు. నిర్మల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, నిర్మల్ సంగతేంటో… నేనే చూస్తా అని అన్నారు. పేదోళ్ల కోసమే పాదయాత్ర చేస్తున్నానని, సంవత్సరం నుంచి మీకోసమే తిరుగుతున్నా అన్నారు. ప్రజలను అప్పులు పాలు చేసి, కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయలకు పడగలెత్తిందని ఆరోపించారు. మోడీ ఆదేశిస్తేనే… పేదల రాజ్యం కోసం పాదయాత్ర చేస్తున్నానని, ఉచిత బియ్యం, ఉచిత వ్యాక్సిన్ ఇచ్చింది మోడీనే అన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే అని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు గుంటనక్కల్లా కబ్జాలు చేసి, వేలకోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఈ పాదయాత్రలో కొన్ని గ్రామాలకు రాలేకపోతున్నా… మళ్లీ తప్పకుండా వస్తా అని తెలిపారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే… అందరికీ మన ప్రభుత్వం లో న్యాయం చేస్తామన్నారు బండి సంజయ్.
Nadendla Manohar: పుంగనూరు దాడిని ఖండిస్తున్నాం.. రైతు సభ నిర్వహణ నేరమా?