NTV Telugu Site icon

TSPSC Paper Leak: TSPSC పరీక్ష రద్దుపై ఉత్కంఠ.. మధ్యాహ్నం రానున్న క్లారిటీ

Tspsc Paper Leak

Tspsc Paper Leak

TSPSC Paper Leak: మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం కానుంది. సర్వీస్ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 5 న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీ పై కమిషన్ చర్చించనున్నారు. పరీక్షను రద్దు చేయాలా లేక లీక్ పేపర్ అందిన వారిని తొలగించి ముందుకు వెళ్లాలా? అనే దాని పై కమిషన్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బాధ్యులైన ఇద్దరి పై కమిషన్ చర్యలు తీసుకున్నారు. పరీక్షను రద్దు చేస్తే ఎలా అంటూ విద్యార్థుల్లో టెన్షన్‌ మొదైలైంది. దీనిపై కమీషన్‌ ఛైర్మన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Read also: Warangal: టికెట్ విషయంలో గొడవ.. రైలులో టీసీపై దాడి

అసలేం జరిగిందంటే..బీటెక్ పూర్తి చేసిన ప్రవీణ్ తండ్రి హరిచంద్రరావు ప్రభుత్వ ప్రింటింగ్ కార్యాలయంలో అదనపు ఎస్పీగా పనిచేశారు. ప్రవీణ్ తండ్రి విధి నిర్వహణలో మృతి చెందడంతో కారుణ్య నియామకం కింద అక్కడ జూనియర్ అసిస్టెంట్‌గా చేరాడు. 2017 నుంచి టీఎస్ పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ప్రవీణ్‌ మహబూబ్ నగర్ జిల్లా పగిడ్యాల పంచగల్ తండాకు చెందిన ఎల్.రేణుక గురుకుల టీచర్ పరీక్షకు దరఖాస్తు దరఖాస్తు చేయగా తప్పులు దొర్లటంతో టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రవీణ్‌ను కలుసుకుని అతని ఫోన్ నంబర్ తీసుకుని అతనితో తరచూ మాట్లాడుతుండేది రేణుక. ప్రస్తుతం వనపర్తి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న రేణుక పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ తన సోదరుడు కె.రాజేశ్వర్ నాయక్‌కు ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. వికారాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన భర్త ధాక్యానాయక్‌తో కలిసి ప్రవీణ్‌ను సంప్రదించింది. అయితే.. ఇదే కార్యాలయంలో నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డితో కలసి ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు పథకం వేశారు.

Read also: Perni Nani: జనసేన ఆవిర్భావ సభపై పేర్నినాని సెటైర్లు.. అందుకే పవన్‌ సభ

ఈనేపథ్యంలో.. కమిషన్‌ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌.. కార్యదర్శి డైరీలోని ఐపీ అడ్రస్‌ను దొంగచాటుగా సేకరించాడు. కాగా.. రాజశేఖర్‌రెడ్డితో కలసి కార్యాలయ ఇన్‌ఛార్జి కంప్యూటర్‌ నుంచి వివిధ విభాగాల ప్రశ్నపత్రాలున్న ఫోల్డర్‌ను ప్రవీణ్‌ 4 పెన్‌డ్రైవ్‌ల్లో భద్రపరిచాడు. ఇక… కార్యాలయంలోనే పదుల సంఖ్యలో కాపీలు తీసుకున్నాడు. దీంతో.. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రాలను అక్కడే ప్రింట్‌ తీసుకున్నారు. అంతేకాకుండా.. వాటిని మార్చి 2న రేణుక, ఢాక్యానాయక్‌లకు ఇచ్చి 5 లక్షలు తీసుకున్నాడు. రేణుక, ఢాక్యానాయక్, రాజేశ్వర్‌ నాయక్‌లను ప్రవీణ్‌ బడంగ్‌పేట్‌లోని తన నివాసానికి తీసుకెళ్లి రెండ్రోజులపాటు అక్కడే ఉంచాడు. కాగా.. ఈ నెల 5న రాజేశ్వర్‌ను తన వాహనంపైనే పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి ఉదయం, సాయంత్రం రెండు పేపర్లు రాయించి తీసుకొచ్చాడు. ఇక.. పరీక్ష పూర్తయ్యాక ఈ నెల 6న రేణుక దంపతులు ప్రవీణ్‌కు మరో 5 లక్షలు ఇచ్చారు..ఇవి బేస్‌ పేపర్లు కావటంతో ప్రశ్నలు, సమాధానాలు పక్కనే ఉంటాయి. దీంతో.. సొమ్ము చేసుకునేందుకు రేణుక దంపతులు కొత్త పథకం వేసిన వీళ్లు మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లా మన్సూర్‌పల్లి తండాకు చెందిన కె.శ్రీనివాస్‌ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుసుకొని తమ వద్ద ప్రశ్నపత్రాలు ఉన్నట్లు సమాచారమిచ్చారు.

Read also: Half day School: రేపటి నుంచే ఒంటిపూట బడులు

అతను ఎస్సై ఉద్యోగానికి సిద్ధమవుతున్నానని ఈ పరీక్ష రాసేవాళ్లు వేరే ఉన్నారంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నీలేష్‌నాయక్‌, పి.గోపాల్‌నాయక్‌ల వివరాలిచ్చాడు. అయితే.. తను సమాచారంతో ఆ ఇద్దరికీ 13.50 లక్షలకు ఏఈ సివిల్‌ ప్రశ్నపత్రాలు విక్రయించారు. అయితే.. ప్రశ్నపత్రాలు లీకైనట్లు గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు బేగంబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. దీని వెనక ప్రవీణ్‌ ప్రమేయం ఉండొచ్చనే అనుమానం వ్యక్తంచేశారు. దీంతో.. సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్, బేగంబజార్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి కంప్యూటర్ల నుంచి ప్రశ్నపత్రాలు చోరీ చేసినట్లు తేల్చారు. ఇక.. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో విషయం వెలుగుచూసింది. ఈనేపథ్యంలో.. లీకేజీతో ప్రమేయం ఉన్న ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్, రేణుక, ఢాక్యానాయక్, కె.రాజేశ్వర్‌నాయక్, కె.నీలేష్‌నాయక్, పి.గోపాల్‌నాయక్, కె.శ్రీనివాస్, కె.రాజేంద్రనాయక్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా.. నిందితుల్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులుండటం గమనార్హం.
Arvind Kejriwal: రాజస్థాన్‌పై ఆప్‌ గురి.. బీజేపీ, కాంగ్రెస్ సంగతేంటి?