NTV Telugu Site icon

KTR Tweet: ఓపిక పడుతున్నాం మంత్రి ట్విట్‌ వైరల్‌

Ktr

Ktr

KTR Tweet: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్ పై రాజకీయ దుమారం రేగుతుంది. అధికార, ప్రతిపక్ష మాటలు తూటాల్లా పేలుతున్నాయి. పేపర్‌ లీక్ విషయంలో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. అయితే పేపర్‌ లీక్‌ పై ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దీనికి కారణం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం పనే అని, రాజీనామా చేయాలని సోషల్‌ మీడియా ద్వారా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. మీరు ఏం మాట్లాడిన సైటెంట్‌ ఉన్నాం. అయినా ఇన్ని మాటలు తగవు ఓపికతో ఉన్నామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలోనే అభ్యంతరకర ట్విట్ ​చేసినందుకే కన్నడ నటుడు చేతన్​ను 14 రోజుల జ్యుడీషియల్ ​కస్టడీకి పంపారని గుర్తు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తో సహా మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ ట్విటర్‌ పేర్కొన్నారు. అయితే బహుశా మేము కూడా కర్నాటక తరహాలోనే సమాధానం ఇవ్వాలేమో! అప్పుడు పరిణామాలు దారుణంగా ఉంటాయన్నారు. కన్నడ నటుడు చేతన్​ ను పోలీసులు అదుపులో తీసుకున్న వీడియోను జత చేస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు అంటే.. అబ్యూస్​ చేసే హక్కు ఉన్నట్టు కాదని మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ గా మారింది.