Site icon NTV Telugu

BV Raghavulu : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డివి సిగ్గులేని మాటలు

Bv Raghavulu

Bv Raghavulu

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రణరంగంగా మారింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీపీఎం పొలిట్‌ బ్యూర్‌ సభ్యులు బీవీ రాఘువులు కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డివి సీగ్గులేని మాటలని, అగ్ని పథ్‌ ఎవరితో చర్చ చేసి పెట్టారంటూ ఆయన మండిపడ్డారు. మీరు అందరినీ సంప్రదించి అగ్నిపథ్‌ పెడితే…ఆందోళన కారులు కూడా మీతో చర్చ చేసే వారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యింది అని చెప్పడం సిగ్గుచేటని, ఇక్కడ టీఆర్‌ఎస్‌ విఫలం అయ్యింది అంటే… బీహార్…గుజరాత్.. యూపీ..బీజేపీ పాలిత ప్రాంతాల్లో మీ ప్రభుత్వం విఫలం అయినట్టే కదా..? అని ఆయన ప్రశ్నించారు.

దేశాన్ని అమ్మేసిన మోడీ.. ఇప్పుడు సైన్యంనీ కూడా ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అగ్ని పథ్‌ని వెనక్కి తీసుకోవాలని, సికింద్రాబాద్ ఘటనకు బీజేపీ నే బాధ్యత వహించాలన్నారు. సికింద్రాబాద్ ఆందోళన వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయని అనడం సిగ్గుమాలిన మాటలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ విధ్వంసం వెనక బీజేపీ చర్యలే అంటూ ఆయన ఆరోపించారు.

Exit mobile version