Hyderabad: నగరానికి క్యూ కట్టిన జనం.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులు, రైళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటు వేసేందుకు ఇళ్లకు వెళ్లిన వారంతా పోలింగ్ ముగియడంతో తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే ప్రయాణికులతో నగరంలోని మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నగరానికి చేరుకున్న ప్రయాణికులు తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు మెట్రో రైళ్ల వినియోగం పెరగడంతో హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ఎల్బీ నగర్-మియాపూర్ మార్గంలో మెట్రోలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. చాలా మంది మెట్రో రైలులో నిలబడి ప్రయాణిస్తున్నారు. కొన్ని రైళ్లలో నిలబడేందుకు కూడా గ్యాప్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఉదయం 5.30 గంటల నుంచి ఓటర్ల తిరుగు ప్రయాణంతో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అరగంట ముందుగానే మెట్రో సర్వీసును ప్రారంభించారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ మెట్రో మరిన్ని ట్రిప్పులు నడపాలని యోచిస్తోంది.
Read also: Rajasthan : 1800అడుగుల కింద పడిపోయిన లిఫ్ట్.. గనిలో చిక్కుకున్న 150 మంది కార్మికులు
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
దీనికి తోడు కార్యాలయాలకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరగడంతో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. మరోవైపు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారి ట్రాఫిక్‌తో కిటకిటలాడుతోంది. ఎన్నికలకు వెళ్లిన ఏపీ ప్రజలు మళ్లీ నగరానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజాలో 16 గేట్లు ఉండగా హైదరాబాద్ వైపు పది గేట్లు తెరిచారంటే రద్దీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. 95 శాతం వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఉండడంతో వాటిని త్వరగా స్కాన్ చేసి పంపుతున్నారు. ఏపీకి వెళ్తే అదే జనం: ఏపీలో సోమవారం జరిగిన ఎన్నికలకు శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు పెద్ద ఎత్తున ఓటర్లు వెళ్లారు. దీంతో నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మళ్లీ తిరుగు ప్రయాణంలో కూడా ఈ ట్రాఫిక్ తప్పడం లేదు.
Tadipatri: పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం..
తాజావార్తలు
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!