Bus accident near Kondagattu: జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇక్కడి రహదారులపై ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాదారులు తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బలవంతపూర్ ప్రధాన రహదారి రక్తసిక్తమైంది. ఎదురుగా వస్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును అతివేగంగా ఢీకొట్టడంతో.. ఎనిమిది మంది తీవ్రగాయాలు కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఈఘటన కొండగట్టు సమీపంలోని చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై లారీ, ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. ఈఘటన కొండగట్టు సమీపంలోని బల్వంతాపూర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారు జామున ఈప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. రోడ్డుపై లారీ, బస్సులు ముందు భాగాలు తునాతునకలు అయ్యాయి. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ మద్యం సేవించి లారీ నడిపాడా? లేక బస్సు డ్రైవర్ నిద్రలో ఉండటం వలన ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణించే వారు గాఢ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గురికావడంతో రహదారిలో ఆర్తనాదాలు మిన్నంటాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులకు వైద్యంకోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈఘటన ఎలా జరిగింది అనేదానిపై ఆరాతీస్తున్నారు.
Step Wells : తెలంగాణలో మెట్ల బావులపై వెలుగులు నింపేందుకు కీలక నిర్ణయం