Harish Rao: ఇవాళ అసెంబ్లీలో 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈనేపథ్యంలో.. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీకి బయల్దేరనున్న ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు శాసన సభలో హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 4వ సారి. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని అన్నారు.
Read also: Bandi Sanjay: నాందేడ్ వేదిక పెద్ద డ్రామా.. ఇక్కడే గతిలేదు అక్కడ పట్టించుకుంటారా?
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కేంద్ర వివక్ష చూపుతున్న తెలంగాణ స్వంత కాళ్ళ మీద నిలబడిందని అన్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగునంగా పేదలకు ఇచ్చిన మాటగా బడ్జెట్ ఉంటుందని తెలిపారు మంత్రి. సంక్షేమం, అభివ్తుద్ది జోడెడ్ల మాదిరి తెలంగాణ ముందుకు వెళుతుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ఉండబోతుందని అన్నారు. తెలంగాణ పథకాలు దేశంలోనే మోడల్ గా నిలవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. యావత్ దేశం తెలంగాణ పథకాలపై ప్రశంశలు కురుస్తున్నాయని తెలిపారు. దేశంలో మోడల్ గా తెలంగాణ నిలిచిందన్నారు మంత్రి హరీష్ రావు.
TS Assembly Sessions: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్.. ఈసారి హరీష్ లెక్క ఎంతంటే?