హైదరాబాద్ బాచుపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వెంటనే గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థి మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే విద్యార్థి ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు వీఎన్ఆర్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. కాలేజీ క్యాంపస్‌లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యాజమాన్యం.. పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.
