NTV Telugu Site icon

KTR: మరోసారి మానవత్వం చాటుకున్న కేటీఆర్‌..

Ktr Car

Ktr Car

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదానికి గురైన బాధితుడిని తన ఎస్కార్ట్ కారులో ఆసుపత్రికి తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే వ్యక్తి ప్రమాదానికి గురై రోడ్డుపై పడిపోయాడు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచార నిమిత్తం కేటీఆర్ హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళ్తున్న మార్గంలో… వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే వ్యక్తి ఆక్సిడెంట్ కు గురై కిందపడి ఉన్నాడు. అతన్ని గమనించిన కేటీఆర్ వెంటనే కారు దిగి అత్యవసర చికిత్స నిమిత్తం తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ కారులో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేటీఆర్ సకాలంలో స్పందించి బాధితుడికి అండగా నిలిచారని పలువురు కొనియాడారు. అనంతరం నర్సంపేటలో ఏర్పాటు చేసిన వరంగల్ – నల్లగొండ – ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతూ.. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినా యువతను కోల్పోయామన్నారు.

Read also: Medaram Priests: ఈనెల 29, 30 తేదీల్లో ధర్నా చేస్తాం.. మేడారం పూజార్ల హెచ్చరిక..

2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినా యువతను కోల్పోయాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచినా వారిని దూరం చేశాం. ఇలా చేశానని చెప్పుకోలేక ఓడిపోయానని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల వల్ల ప్రభుత్వం పడిపోదు. వెనక్కి తగ్గేది లేదు. ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కేసీఆర్‌తో సహా మేమంతా ప్రతి నియోజకవర్గంలో పర్యటించాం. దయచేసి మోసపోకండి.. కబుర్లు చెబుతాం అన్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనపై విద్యావంతులు ఆలోచించాలని కోరుతున్నాను. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితి గురించి ఆలోచించండి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అందమైన నినాదాలు ఎక్కడున్నాయో ఆలోచించండి. నాకు ఓటు వేస్తే డిసెంబరు 9న 2 లక్షల రుణమాఫీ పత్రంపై మొదట సంతకం చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. అత్యవసరంగా బ్యాంకుకు వెళ్లి 2 లక్షల రుణం ఇప్పించాలని సూచించారు. డిసెంబర్ 9 పోయింది.. మరో పది రోజుల్లో జూన్ 9 రానుంది. ఆరు నెలలు గడిచిపోతాయి. తొలిరోజు సంతకం చేస్తానని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచించాలని పట్టభద్రులను కేటీఆర్ కోరారు.
Maharastra : భర్తతో గొడవ.. కూతురిని చంపి శవంతోనే రోడ్లపై తిరిగిన తల్లి