NTV Telugu Site icon

KTR: కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించిన కేటీఆర్

Ktr

Ktr

KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పార్టీలు, వేడుకలకు అతీతంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు కేటీఆర్. పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వచ్చిన పారిశుధ్య కార్మికులతో కేటీఆర్ సరదాగా ముద్దులు దిగి సెల్ఫీలు దిగారు. అలాగే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కార్మికులందరికీ హారతి ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో కేటీఆర్‌ భోజనం చేశారు. పారిశుధ్య కార్మికులకు కరచాలనం చేస్తూ కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. వారితో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను కేటీఆర్‌ అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Read also: Telangana Police: పోలీసులకు సేవా పతకాలు.. గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌‌కు శౌర్య పతకం

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ద్వారా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ కృషి చేసిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. కనీస వేతనంతో పనిచేస్తున్న వారికి జీతాలు పెంచి… గౌరవంగా బతికేలా చేశామన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, పీఎఫ్, ఈఎస్‌ఐ, మెడికల్ లీవ్ సౌకర్యాలు కల్పించాలని… ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్‌కు బీఆర్‌ఎస్‌ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకుని కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పూలమాలలు సమర్పించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Police: పోలీసులకు సేవా పతకాలు.. గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌‌కు శౌర్య పతకం