BRS Leaders: మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరగనున్న పద్మశాలి ఆరాధ్యదైవం మార్కండేయ రథోత్సవంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి వలస వచ్చిన పద్మశాలీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రం తరపున మంత్రులు హాజరుకానున్నారు. షోలాపూర్ లో భరత్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికను హరీశ్ రావు బృందం పరిశీలించనుంది. షోలాపూర్‌లో పద్మశాలి ఆరాధ్యదైవం మరండేయ రథోత్సవం ఘనంగా జరగనుంది. తెలంగాణ నుంచి తరలివెళ్లి షోలాపూర్ లో స్థిరపడిన పద్మ శాలీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరగనున్న రథోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులతో పాటు బీఆర్ ఎస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎల్ .రమణ, మహారాష్ట్ర బీఆర్ ఎస్ ఇన్ చార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు హాజరుకానున్నారు. కాగా, ఈ పర్యటనలో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం త్వరలో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించనుంది.
Read also: Health Tips : ఖాళీ కడుపుతో నెయ్యిని తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
జులై 9న షోలాపూర్‌కు చెందిన 300 మంది నాయకులు సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే.. తన ప్రయత్నానికి అత్యధిక మద్దతు లభించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు కేసీఆర్. తన అభివృద్దికి మహారాష్ట్ర ప్రజలు మద్దతిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, తెలంగాణతో 1,000 కి.మీ సరిహద్దును పంచుకునే మహారాష్ట్రకు మద్దతు పలకడం గమనార్హం. చంద్రశేఖర్ రావు ఇటీవల నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి, పండర్‌పూర్, తుల్జాపూర్‌లో పర్యటించారు. ర్యాలీ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వారం రోజుల ముందుగానే షోలాపూర్‌కు బయలుదేరి అక్కడ సభ స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే.
Flipkart Offers Today: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. 14 వేల తగ్గింపుతో ఎల్‌జీ వాషింగ్ మిషన్!