Site icon NTV Telugu

BRS Rythu Deeksha: నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ రైతు దీక్షలు..

Kcr

Kcr

BRS Rythu Deeksha: నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ రైతుదీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి బీఆర్‌ఎస్‌ రైతుదీక్షను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొని కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భద్రత పేరుతో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్నా హామీలను అమలు చేయకుండా రైతులను అవమానిస్తున్నదని, రైతుబంధు విడుదలలో జాప్యం, కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Read also: Rains in Telangana: తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు.. హైదరాబాద్‌కు సూచన లేదా..!

రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల 209 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రైతు దీక్షలు చేపట్టనున్నారు. సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీశ్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతుదీక్షలు చేపట్టనున్నారు.
Congress Janajatara: నేడు కాంగ్రెస్ జనజాతర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!

Exit mobile version