BRS Party: కడియం శ్రీహరి పార్టీ మార్పు పై బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, పెద్ద సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. హన్మకొండ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని హితువు పలికారు. కడియం కావ్య పెట్టిన కామెంట్ చూసి నేను ఆశ్చర్యపోయామన్నారు. 31 తారీఖున చేపట్టే కార్యక్రమాల గురించి మాట్లాడేందుకు కడియం శ్రీహరి ఇంటికి 8 గంటలకు నేను స్వయం వెళ్లాను అప్పుడు కూడా ఏలాంటి కామెంట్ చేయలేదన్నారు. కడియం శ్రీహరి అహంకారంతో ఎంతోమందిని బలి పశులను చేశారన్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను నాయకులలో అణిచివేసిన చరిత్ర కడియం శ్రీహరి అని మండిపడ్ఆరు. టీడీపీలో పని చేసిన సమయంలో చంద్రబాబును బ్లాక్ మెయిన్ చేసి పదవులు తీసుకున్న చరిత్ర కడియం శ్రీహరి ది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నిస్వార్థంతో బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటే.. బీఆర్ఎస్ లో అదే విధానాలు అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Pakistan: చైనా షాక్ ఇచ్చేందుకు రెడీ అయిన పాకిస్థాన్.. భారతే అందుకు కారణమా..?
విజయరామారావు, దొమ్మాటి సాంబయ్య, ఎంపీ దయాకర్, అరూరి రమేష్, రాజయ్యలను బయటకు వెళ్ళేలా చేశారు కడియం శ్రీహరి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కుట్రలు చేసి పార్టీకి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి నిజాయితీపరుడు అయితే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం సీనియార్టీని గౌరవించి డిప్యూటీ సీఎం చేస్తే ఇంతటి దిగజారుడుకు పనికి చేస్తావా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పార్టీలు మాట్లాడుతున్న మోసం చేసిన కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్యాకేజీ మాట్లాడుతున్న కాంగ్రెస్ నుంచి పోటీలో నిలబడాలని కోరారు.
Read also: K. Keshava Rao: సీఎం రేవంత్ రెడ్డి తో ముగిసిన కేకే భేటీ..
పెద్ద సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో గత నెల రోజులు జరుగుతున్న పరిణామాలకు కడియం శ్రీహరి నే బాధ్యుడు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో చరిత్రకా కడియం శ్రీహరి ఒక్కసారి కూడా ఖాళీగా లేరన్నారు. కడియం శ్రీహరిని ఉపముఖ్యమంత్రి చేసేందుకు ఉప ఎన్నికలను కూడా తీసుకొచ్చి నీ గెలుపు కోసం పార్టీ మొత్తం పని చేసింది ఇలాంటి పార్టీని మోసం చేశారని మండిపడ్డారు. ఎప్పుడు విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి నీ కూతురు కోసం విలువలను పక్కకు పెట్టరా? అని ప్రశ్నించారు. మరో సారి విలువల గురించి మాట్లాడ వద్దన్నారు. రేపు స్టేషన్ ఘనపూర్ కార్యకర్తల సమావేశం పెడుతున్నాం.. మీ భలం ఏంటో తెలుస్తుంది.. స్టేషన్ ఘనపూర్ కార్యకర్తలు అందరూ కేసీఆర్ తోనే ఉన్నారని తెలిపారు.
Danam Nagender: కన్ఫూజన్‌లో దానం..! మారనున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి..
