NTV Telugu Site icon

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే కవితకు బెయిల్ ను ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.. దాంతో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసులో నిందితులుగా ఉన్న 50 మందిలో ఆమె ఒక్కరే మహిళ కావడం, తల్లిగా బిడ్డ బాగోగులు చూడాల్సి ఉండడంతో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత చేసిన వాదనలను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు అదే అంశాల ఆధారంగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Read also: Shiva Parayanam: సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి

కాగా.. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. సిసోడియాకు బెయిల్ మంజూరైన తరుణంలో.. సత్వర విచారణ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కవిత బెయిల్ అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లి లిక్కర్ కేసులో కవితను మార్చి 15 న ఈడి, ఏప్రిల్ 11 న సీబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉన్నారు. మరి ఈరోజు కవితకు బెయిల్ వస్తుందా లేక విచారణ వాయిదా వేస్తారా? అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.

Read also: Lord Shiva Stotram: శ్రావణమాసం రెండో సోమవారం ఈ స్తోత్రాలు వింటే పాపాలు తొలగిపోతాయి

తాజాగా.. ఎమ్మెల్సీ కవిత కు నెక్స్ట్ వీక్ బెయిల్‌ పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ చిట్ చాట్ లో తెలిపిన విషయం తెలసిందే.. కవిత కు హెల్త్ సిక్ అయ్యిందని అన్నారు. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీ ల బరువు తగ్గిందని అన్నారు. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతుందని.. నెక్స్ట్ వీక్ బెయిల్ వస్తుందన్నారు. కవితరకు బీజేపీ బెయిల్‌ ఇప్పిస్తుందనే కథనాలపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది? అని మండిపడ్డారు. ఇలాంటి వార్తలు రాసిన (రవి ప్రకాష్ కు) వారిపై లీగల్ నోటీసు పంపిస్తామన్నారు. బేస్ లెస్ వార్తలు వేస్తున్నారని మండిప్డడారు. యూ ట్యూబ్ లో కూడా రాకుండా సస్పెండ్ చేయిస్తామన్నారు. అయితే కవితకు వచ్చే వారం బెయిల్ వస్తుందని కేటీఆర్ ప్రకటించడంతో ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది.
Astrology: ఆగస్టు 12, సోమవారం దినఫలాలు