Maheshwar Reddy: కేసీఆర్ పేదల భూములు లాక్కున్నారన్న కాంగ్రెస్.. లాభ పడింది ఎవరో చెప్పడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. పేదల భూములు కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు కదా.. లాభం పొందిన గులాబీ లీడర్ లు ఎవరో కాంగ్రెస్ ఇప్పటి వరకు చెప్పడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో భూ కుంభకోణంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. భూ కుంభకోణం పై సీబీఐ విచారణకి ఎందుకు ఆదేశించడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఎన్నో కుంభకోణాలు జరిగాయని భట్టి చెప్పారు.. ఎందుకు సీబీఐ విచారణకు ఇవ్వడం లేదన్నారు. పార్ట్ బీలో ఉన్న భూమి 18 లక్షల 40 వేల ఎకరాలు .. పార్ట్ బీలో ఉన్న భూమి ఇష్యూ ఎలా పరిష్కరిస్తారన్నారని ప్రశ్నించారు.
Read also: RSS Chief: పెరుగుతున్న మందిర్-మసీద్ వివాదాలు.. ఇది ఏమాత్రం మంచిది కాదు..!
ధరణి కుంభకోణం వెనుక ఎంత పెద్ద వాళ్ళు ఉన్న వదిలిపెట్టమని మంత్రి పొంగులేటి అన్నారు అని తెలిపారు. భారత దేశం లోనే అతి పెద్ద భూ కుంభకోణం.. విచారణ ఎందుకు చేయడం లేదు… దీని వెనుక బ్లాక్ మెయిల్ దందా ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. సెటిల్ మెంట్స్ కోసం ఆరోపణలు చేస్తున్నారా? దీని పైన సీట్ ఏమైనా వేస్తారా అన్నారు. అన్యాయానికి గురైన రైతుల వివరాలు ఎందుకు పెట్టడం లేదు.. ఇంతవరకు ఎంత మందికి న్యాయం చేశారు? అని ప్రశ్నించారు. ల్యాండ్ ట్రిబ్యునల్ ఎప్పటి వరకు ఏర్పాటు చేస్తారన్నారు. రైతులు ఆవేదనతో ఉన్నారననారు. బీఆర్ఎస్ నేతలు మింగిన సొమ్మును ఎందుకు కక్కించడం లేదన్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కించి 6 గ్యారంటీలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రకారంలో చెప్పారన్నారు. పేదల భూములు కేసీఆర్ లాక్కున్నారనీ ఆరోపించారు.. లాభం పొందిన లీడర్ లు ఎవరో కాంగ్రెస్ ఇప్పటి వరకు చెప్పడం లేదన్నారు.
Read also: Dead Body in Parcel: పార్శిల్‌లో డెడ్‌బాడీ.. పశ్చిమగోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన!
కాగా.. సభలో బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి స్పీచ్ ను బీఆర్ఎస్ ఎంఎల్ఏ లు అడ్డుకున్నారు. మహేశ్వర రెడ్డి మాట్లాడుతుండగా బడే బాయి చోటే భాయి అంటూ నినాదాలు చేశారు. దీనిపై బీజేపీ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. పదే పదే డిస్టర్బ్ చేస్తే ఎలా మాట్లాడాలి ? అని ప్రశ్నించారు. సభను ఆర్డర్ లో పెట్టాలని స్పీకర్ ను కోరిన ఏలేటి కోరారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏ లు నినాదాలు ఆపకపోవడంతో సభను స్పీకర్ 10 నిమిషాలు వాయిదా వేశారు.
West Indies vs Bangladesh: సొంతగడ్డలో వెస్టిండీస్‌కు ఘోర అవమానం.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్