NTV Telugu Site icon

Gadari Kishore : పేపర్ లీకేజీ వీరులు అంతా బీజేపీ వాళ్లే

Gadari Kishore

Gadari Kishore

బండి సంజయ్ లోఫర్‌ లా మాట్లాడుతున్నరంటూ ధ్వజమెత్తారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ వెధవ అని, బీజేపీ అంటే బ్రోకర్ గాల్లు, జోకర్ గాల్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువు రాని సన్నాసిని అధ్యక్షుడిని బీజేపీ పెట్టిందని ఆయన మండిపడ్డారు. భావ దరిద్రంలో బీజేపీ కొట్టిమిట్టడుతోందని ఆయన విమర్శించారు. మోడీ సర్టిఫికెట్లు చూపించాలని కోరుతున్నామని, భారత దేశంలో ఎప్పుడు పేపర్ లీక్ కాలేదు అన్నట్టు బీజేపీ చేస్తుందని ఆయన దుయ్యబట్టారు.

Also Read : Somireddy Chandramohan Reddy: సిలికా శాండ్‌ కుంభకోణంపై విచారణ జరపాలి

పేపర్ లీకేజీ వీరులు అంతా బీజేపీ వాళ్లే అని గాదరి కిషోర్‌ ఆరోపించారు. కేసీఅర్ చదువు బీఏ నే అని, ఎక్కడ చూసినా అదే ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాలు లీకేజీ వ్యవహారం మరవకముందే.. మరోసారి టెన్త్‌ పేపర్లు లీక్‌ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచనల సృష్టిస్తున్నాయి. అయితే.. ఈ పేపర్‌ లీకేజీలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారడంతో.. ప్రభుత్వంపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో.. విపక్షాలకు ధీటుగా బీఆర్‌ఎస్‌ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Also Read : Revanth Reddy: కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు