Site icon NTV Telugu

Golkonda Bonalu: గోల్కొండ అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించిన మంత్రులు

Bonalu Talasani

Bonalu Talasani

Golkonda Bonalu: హైదరాబాద్‌లో బోనాల పండుగ ప్రారంభమైంది. గోల్కొండ కోట లంగర్‌హౌస్‌ చౌరస్తాలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, మహ్మద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించారు. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట వరకు జరిగిన తొట్టెల ఊరేగింపులో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మహంకాళి, జగదాంబిక జాతర బోనాల ఉత్సవాలు నేడు ప్రారంభమవుతున్నాయని, తెలంగాణ నడిబొడ్డున ఉన్న జగదాంబిక అమ్మవారికి వైభవంగా బోనాలు సమర్పించామన్నారు. తెలంగాణ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో బోనాలు జరిగాయని తలసాని వెల్లడించారు.

Read also: ED Raids: రెండవ రోజు ఈడీ సోదాలు.. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై దాడులు

హైదరాబాద్ అంతటా సికింద్రాబాద్, లాల్ దర్వాజ్ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. భారతదేశంలోని హిందువుల గురించి అందరూ మాట్లాడతారు. కానీ, హిందువుల పండుగలకు అండగా నిలిచేది సీఎం కేసీఆర్ అని అన్నారు. యాదాద్రిని దేశం మొత్తం చెప్పుకునే విధంగా సీఎం కేసీఆర్ 1200 కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని మంత్రి తలసాని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోల్కొండ జగదాంబిక అమ్మవారి జాతర చాలా తక్కువ మందితో జరిగేది. కానీ, ఇప్పుడు లక్ష మందికి పైగా పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. పట్టువస్త్రాలు సమర్పించి ఆషాడ మాసం మొత్తం బోనాల జాతర కొనసాగుతుందని, వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ బోనాలకు తరలివస్తారని తెలిపారు. ఎక్కడా లేని విధంగా బోనాల జాతర వైభవంగా నిర్వహిస్తున్నామని, పండుగకు ముందు బోనాల పండుగకు 15 కోట్ల రూపాయలు ఇచ్చామని మంత్రి తలసాని తెలిపారు.

Read also: Komatireddy Venkatreddy: అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెపుతాం

హైదరాబాద్ పట్టణంలోని మన భాగ్యనగరంలో బోనాల పండుగ ప్రారంభమైందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈరోజు జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాలలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు. నెలరోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటామని, తెలంగాణ వచ్చిన తర్వాత ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. బోనాల పండుగకు 15 కోట్ల బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని, బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వర్షంతో దేవుడు స్వాగతం పలికాడని మంత్రి తెలిపారు. నేటితో దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమర వీరుల జ్యోతి ప్రజ్వలన చేయనున్నట్లు తెలిపారు. అందరూ సహకరించి పండుగను ఘనంగా నిర్వహించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.

Exit mobile version