Site icon NTV Telugu

Revanth Reddy: భూపాలపల్లిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డిపై టమోటా, గుడ్లతో దాడి

Revanth Reddy Tomato Attack

Revanth Reddy Tomato Attack

BRS Leaders Attack On Revanth Reddy With Tomato Eggs In Bhupalapally: భూపాలపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో.. బీఆర్ఎస్ కార్యకర్తలపై ఆయనపై దాడి చేశారు. కోడిగుడ్లు, తమోటాలు విసిరారు. ఇవి రేవంత్ రెడ్డికి తగలలేదు కానీ, సభలోకి కొంతమందికి తగిలాయి. బీఆర్ఎస్ కార్యకర్తల్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆపకుండా దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కాటారం ఎస్సై శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన తలకు దెబ్బలు తగలడంతో, వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి సభలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డగించి, స్థానిక సినిమా థియేటర్‌లో బంధించారు.

Man Steal Flower Pots : ఖరీదైన ఎస్‎యూవీ కార్లో వచ్చి.. క్యా ‘కియా’ రే

ఈ దాడిపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనపై కోడిగుడ్లు, తమోటాలు విసరడం కాదని.. దమ్ముంటే సభ వద్దకు రావాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డికి సవాల్ విసిరారు. తాను తలచుకుంటే.. నీ ఇల్లు ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో జిల్లా ఎస్పీపై కూడా రేవంత్ నిప్పులు చెరిగారు. ‘‘గండ్ర నీకు చుట్టం కావొచ్చు, నీ గుడ్డలు ఊడే సమయం ఆసన్నమైంది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం అనుకుంటున్నావా? అని ఎస్పీని ప్రశ్నించారు. తమ సభపై ఆవారాగాళ్లు దాడులు చేస్తుంటే.. చూస్తూ ఊరికే ఉంటారా? అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ ఉందని తాము ఒక రోజు వాయిదా వేసుకున్నామని.. కానీ దాడులు జరుగుతుంటే మీరు పట్టించుకోవడం లేదంటూ ఎస్పీ, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Thai Drug Dealer : డామిట్ కథ అడ్డం తిరిగింది.. ఎన్ని సర్జరీలు చేయించుకున్న దొరికేశా

Exit mobile version