NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: నల్గొండలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ

Komatireddy Attack

Komatireddy Attack

BRS Leaders Attack On Komatireddy Venkat Reddy In Nalgonda: నల్గొండ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాలిగౌరారం మండలంలోని ఇటుకలపాడు గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమకు అందుబాటులో ఉన్న వస్తువులను (కుర్చీలు, కర్రలు) ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై విసిరేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన ఆయన.. తన ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రోడ్లు బాగోలేవని, ఇటుకులపాడు గ్రామానికి రావడానికి మూడు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు. వెయ్యి కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం.. ఒక్క కోటి రూపాయలు ఇచ్చుంటే ఈ రోడ్డు బాగుపడేదని అన్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వెంకటరెడ్డిపై ఆగ్రహానికి గురయ్యారు. వెంకటరెడ్డి మాట్లాడుతుండగానే.. కుర్చీలు, కర్రలు విసిరారు. వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. తన పర్యటనని మధ్యలోనే ముగించుకొని వెంకటరెడ్డి వెళ్లిపోయారు.

Swara Bhasker: రాజకీయ నాయకుడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న బాలీవుడ్ నటి

అంతకుముందు.. పొత్తుల విషయంపై వ్యాఖ్యలు చేసి కోమటిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వస్తుందని.. అప్పుడు కాంగ్రెస్‌తో కేసీఆర్ కలుస్తారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేశాయి. ఓవైపు, కోమటిరెడ్డి ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలియదని టీఆర్ఎస్ నేతలు చెప్పగా.. కోమటిరెడ్డి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. బీఆర్ఎస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే పోరాడి అధికారంలోకి వచ్చేంత బలం కాంగ్రెస్‌కి ఉందని వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి కూడా తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. తాను ఓ సర్వే ప్రకారమే ఆ వ్యాఖ్యలు చేశానని, తమ పార్టీ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోదని వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో బీజేపీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ముసుగు తొలగిందంటూ ఆరోపణ చేసింది. అయితే.. ఫైనల్‌గా కోమటిరెడ్డి తన వ్యాఖ్యల్ని ఉపసింహరించుకోవడంతో ఈ పొత్తుల రగడకు ఫుల్ స్టాప్ పడింది.

Air India: నెక్ట్స్ ఎమిరేట్స్ కావాలన్నదే ఎయిరిండియా లక్ష్యం.. అందుకే రికార్డ్ స్థాయిలో విమానాల కొనుగోలు..