Swara Bhasker: రాజకీయ నాయకుడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న బాలీవుడ్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మధోలాల్ కీప్ వాకింగ్’ సినిమా ద్వారా 2009లో హీరోయిన్ గా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన స్వర భాస్కర్, ఇండియాస్ మోస్ట్ కాంట్రవర్షియల్ హీరోయిన్స్ లో ఒకరు. హీరోయిన్స్ అనే కాదు ఇండియాలోని మోస్ట్ కాంట్రవర్షియల్ సెలబ్రిటీస్ లో ఒకరు. నెటిజన్స్ సెలబ్రిటీస్ ని ట్రోల్ చెయ్యడం మాములే కానీ స్వర భాస్కర్ ని కరోనా వచ్చిన సమయంలో… ఆ కరోనాతో నువ్వు చచ్చిపోతే బాగుంటుంది అనే రేంజులో స్వర భాస్కర్ ని ట్రోల్ చేశారు అంటే ఆమెపై ఉన్న ద్వేషం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు, రియా చక్రవర్తికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో స్వర భాస్కర్ పై మరిన్ని విమర్శలు వినిపించాయి. సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్ ని అయినా ప్లే చెయ్యగల టాలెంట్ ఉన్న అమ్మాయిగా పేరు తెచ్చుకుంటూనే స్వర భాస్కర్ సోషల్ గా సంఘంలో జరిగే వాటిపై కూడా గట్టిగానే మాట్లాడేది. ఈ కారణంగానే స్వర భాస్కర్ ని ట్రోల్ చేసే వాళ్లు చాలా ఎక్కువ. పైగా స్వర ANTI-CAA ప్రొటెస్ట్ లో పాల్గొని ట్రోల్ చేసే వాళ్లకి ఇంకా టార్గెట్ గా మారింది.
ఈ ప్రొటెస్ట్ ల సమయంలో స్వర భాస్కర్, సమాజ్ వాది పార్టీ యూత్ లీడర్ అయిన ‘ఫాహాద్ జిరార్ అహ్మద్’ని కలిసింది. పోరాటంలో పుట్టిన ప్రేమో లేక ఆ తర్వాత కలిసి చేసిన ప్రయాణం వలనో కానీ స్వర, ఫాహాద్ రిలేషన్ లోకి వెళ్లారు. ఈ ఇయర్ జనవరి 6న స్వర భాస్కర్, ఫాహాద్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. 2019 వరకూ స్వర ఇంకొకరితో రిలేషన్ లో ఉంది కానీ అది బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత స్వరకి ఫాహాద్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి Anti-CAA నిరసనలు చేశారు. ఎలాంటి హింట్ లేకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్న స్వర భాస్కర్, ట్విట్టర్ లో తన ప్రేమ జర్నీని ఒక వీడియోగా చేసి పోస్ట్ చేసింది. స్వర భాస్కర్ పెళ్లి విషయం తెలియగానే అందరూ షాక్ అవుతున్నారు.
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
Sometimes you search far & wide for something that was right next to you all along. We were looking for love, but we found friendship first. And then we found each other!
Welcome to my heart @FahadZirarAhmad It’s chaotic but it’s yours! ♥️✨🧿 pic.twitter.com/GHh26GODbm— Swara Bhasker (@ReallySwara) February 16, 2023
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!