NTV Telugu Site icon

Harish Rao: ఖమ్మం సభా వేదికపై వారు మాత్రమే ఉంటారు..

Harish Rao

Harish Rao

Harish Rao: దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభగా ఖమ్మం సభ నిలిచిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఈనెల 18న ఖమ్మం సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో కేసీఆర్ కరీంనగర్ లో సింహగర్జన నిర్వహించారని, బీఆర్ ఎస్ తొలి సభను ఖమ్మంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఖమ్మం సభలో పలు జాతీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఖమ్మం ప్రజల పోరాటం, మలి దశ ఉద్యమంలో పాల్గొన్న తీరు మరువలేనిదన్నారు. వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని నిర్మించారని పేర్కొన్నారు. 448 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశామని, 20 పార్కింగ్ స్థలాలను గుర్తించామని పేర్కొన్నారు.

Read also: Stone Pelting: చిచ్చుపెట్టిన చికెన్‌..! రెండు వర్గాల మధ్య దాడులు

సభలో వేలాది మంది వలంటీర్లు పాల్గొంటారని, ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తామన్నారు. ఎక్కువగా 13 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ నిర్వహిస్తామని చెప్పారు. మహబూబాబాద్, సూర్యాపేట నుంచి ఎక్కువ మంది జనం వస్తున్నారు. ఖమ్మం చరిత్రలో పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, కేసీఆర్‌ను ఆశీర్వదించేందుకు సభకు తరలిరావాలని తహతహలాడుతున్నారన్నారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో ప్రజలను తరలించడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఖమ్మం సభకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుందని, డయాస్ ఎదుట ముఖ్య నేతలకు ప్రత్యేక సెక్టార్ కేటాయించామని అన్నారు.

Read also: Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్త? అప్పట్లో సంచలనం

సీఎంతో వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు మాత్రమే ఉంటారని తెలిపారు. కేసీఆర్.. మిగిలిన మంత్రులు, నాయకులు ఎజెండాలో ముందుగా కూర్చుంటారు. మంత్రి తలసాని రిసీవింగ్‌, సెండాఫ్‌ బాధ్యతను అఖిలేష్ యాదవ్ కు అప్పగించారన్నారు. ఢిల్లీ, పంజాబ్‌ సీఎంల ప్రోటోకాల్‌ను మంత్రి మహమూద్‌ అలీ చూసుకుంటారని, కేరళ సీఎం ప్రశాంత్‌రెడ్డి, డి.రాజాలను రిసీవ్ చేసుకునే బాధ్యత పార్టీ నేత దాసోజు శ్రవణ్‌దేనన్నారు. ఇవాళ రాత్రికి నేతలంతా హైదరాబాద్ చేరుకుంటారని, 18న సీఎంతో అల్పాహారం అనంతరం దేశ రాజకీయాలపై చర్చిస్తారని తెలిపారు. సీఎంతో పాటు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఉంటుందని, దర్శనానంతరం రెండు హెలికాప్టర్లలో ఖమ్మం సభకు బయలుదేరి వెళతారని తెలిపారు. సమావేశంలో పాల్గొనే ముందు కలెక్టరేట్‌లో రెండు దశల కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Father Lust on Daughter: ఛీ..ఛీ.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం.. గర్భం దాల్చడంతో..