Jagga Reddy: తాను పాలు పోసి పెంచిన పాము.. తననే కాటేస్తుందనే విషయం తెలియదా? అంటూ ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మేము అధికారంలోకి వస్తే ఈ చట్టం మేము చెప్పిన్నట్లు చేస్తే మీ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీస్ లు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వ్యవహారాలకి సంబంధించి తెలంగాణ లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతునందుకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభత్వం కొందరు పోలీస్ అధికారుల ద్వారా కాంగ్రెస్ పార్టీ అనుబంధం కార్యాలయం పై రాత్రి తనిఖీలా పేరు మీద దాడి చేసి అక్కడున్న స్టాఫ్ ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడని ఖండిస్తున్నామన్నారు. పోలీస్ సెక్షన్ లను అడ్డంపెట్టుకొని అక్కడున్న కంప్యూటర్స్, లాప్ టాప్ సీజ్ చేసి,కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కి తాళం వేయడాని కూడా తీవ్రంగా మండిపడ్డారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉందికదా అని ఇష్టనుసారంగా కొందరు పోలీస్ అధికారులతో చట్టం లో ఉన్న సెక్షన్ లను అడ్డం పెట్టుకొని తెలంగాణ వ్యవస్థలో ఉన్న ప్రజాస్వామ్యని భయబ్రాంతులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో లేని సంప్రదాయాలను ప్రవేశపెట్టిన, ప్రజాస్వామ్య గొంతు ని నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ లో లేని సంప్రదాయని టీఆర్ఎస్ పార్టీ తీసుకొని రావడం ఇది బీఆర్ఎస్ పార్టీ కి యేనటికైనా ప్రమాదమేనని గుర్తించుకోవాలని అన్నారు. తాను పాలు పోసి పెంచిన పాము తాననే కాటేస్తుందనే విషయం తెలియదా..? అంటూ ప్రశ్నించారు జగ్గారెడ్డి. అధికారము పూర్తిగా ఎప్పటికి బీఆర్ఎస్ దే అని ఉహించుకువడం కూడా మీ మూర్ఖత్వమే అంటూ మండిపడ్డారు. మీరు అధికారం కకోల్పోయిన రోజు ఇలాంటి పరిస్థితే మీకు వస్తే ఆ రోజు మీరు ఏ మొఖం పెట్టుకొని మాట్లాడగలుగుతారన్నారు. అధికారంలో ఎవరు ఉంటే పోలీస్ వారి మాట వినాల్సిందే అది చట్టం అన్నారు. రేపు మేము అధికారంలోకి వస్తే ఈ చట్టం మా మాట విని మేము చెప్పిన్నట్లు చేస్తే మీ పరిస్థితి ఏంటి..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రజాస్వామ్యని ఖుని చేసే కొత్త కొత్త ప్రయత్నాలను తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ప్రతిపక్షలను అనగాదొక్కడానికి కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చింది ప్రజా సమస్యలు పరిష్కరించామని అన్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని, కాంగ్రెస్ నాయకత్వని అనగాదొక్కమని కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఆఫీస్ పై దాడిని ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొందరు పోలీస్ అధికారుల నిరంకుశ వైఖరిని ఖండిస్తూ దీని మేము తీవ్రంగా పరిగనిస్తూ ఒక కార్యాచరణ తో పాటు కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభత్వానికి వ్యతిరేకంగా, కొందరు పోలీస్ అధికారుల తిరుకి నీరసనగ ఉద్యమం చేయడం జరుగుతుందని తెలిపారు జగ్గారెడ్డి. ప్రజాస్వామ్య పద్ధతి లో ఉద్యమలు, న్యాయ పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కొంతమంది పోలీస్ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నుండి జగ్గారెడ్డి హెచ్చరించారు.
Acid Attack: 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి.. ఢిల్లీలో ఘటన