NTV Telugu Site icon

BRS Athmeeya Sammelanam: ఖమ్మంలో విషాదం.. సిలిండర్ పేలి తెగిపడ్డ కాళ్లు, చేతులు

Brs

Brs

brs atmiya sammelan firecrackers explode during brs party meeting: ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గందరగోళం నెలకొంది. అప్పటి వరకు నేతల రాకతో సందడిగా ఉన్న ప్రాంతం రక్తసిక్తమైంది. నాయకుల రాకకై బాణా సంచా కాల్చి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్న నేతలకు చేదు అనుభవం ఎదురైంది. బాణాసంచా పేల్చడంతో పక్కనే వున్న గుడెసెపై మంటలు అంటుకున్నాయి. అదికాస్త గుడెసెలో వున్న గ్యాస్ సిలిండర్ కు అంటుకోవడంతో సిలిండర్ పేలింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Read also: Gutha Sukender reddy: ప్రభుత్వ కార్యక్రమంతో బండికి ఏం సంబంధం? ఎలా హాజరవుతారు?

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే రాములునాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి నేతలంతా తరలివచ్చారు. గ్రామానికి అగ్రనేతలు రాక సందర్భంగా పార్టీ శ్రేణులు పటాకులు కాల్చారు. పటాకులు కాల్చడంతో మంటలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. మంటలు చెలరేగి లోపల ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. అదే సమయంలో నివాసంలో ఉన్న సిలిండర్ పేలింది. సిలిండర్‌ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. ఇద్దరు మృతి చెందారు. పోలీసులు, జర్నలిస్టులకు తీవ్ర గాయాలు కాగా.. విధులు నిర్వహిస్తున్న సీఐతో సహా 10 మంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. గాయపడిన వారి పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
Jana Reddy: యశోద ఆస్పత్రిలో చేరిన జానారెడ్డి.. స్టంట్ వేసిన వైద్యులు