NTV Telugu Site icon

Sangareddy Crime: చెల్లిని ప్రేమిస్తున్నాడని.. యువకుడి దారుణ హత్య

Brother Killed Sister Boyfr

Brother Killed Sister Boyfr

Brother Killed His Sister Boyfriend In Sangareddy Thanda: సంగారెడ్డిలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన చెల్లిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఒక యువకుడ్ని ఆమె అన్నయ్య అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అందరూ చూస్తుండగానే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచ్చరేగడి తండాలో సుదీప్ (19) అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలం నుంచి అతడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇన్నాళ్లూ తన ప్రేమ విషయాన్ని గుట్టుగానే దాచాడు. కానీ.. ఇటీవల యువతి సోదరుడు అరుణ్‌కి (19) ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి అతడు సుదీప్‌పై కక్ష పెంచుకున్నాడు. తన చెల్లి జోలికి రాకుండా ఉండాలంటే, అతడ్ని అంతమొందించాల్సిందేనని నిర్ణయించుకున్నాడు.

Sonia Gandhi and Rahul Gandhi: ఆక్సిజన్‌ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ.. భావోద్వేగానికి గురైన రాహుల్‌..

అంతే.. అనుకున్నదే తడువుగా సుదీప్‌ని హతమార్చేందుకు అరుణ్ గొడ్డలి పట్టుకొని బయలుదేరాడు. సుదీప్ ఎక్కడున్నాడో తెలుసుకుని, నేరుగా అక్కడికే వెళ్లి అతనిపై గొడ్డలితో దాడి చేశాడు. నా చెల్లెలినే ప్రేమిస్తావా? అంటూ దాడికి పాల్పడ్డాడు. గొడ్డలితో తలపై దాడి చేయడం వల్ల.. సుదీప్ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. పబ్లిక్‌లోనే అరుణ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతడు దాడి చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్లు చోద్యం చూస్తూ ఉండిపోయారే తప్ప, ఎవ్వరూ ఆపడానికి సాహసం చేయలేదు. సుదీప్ చనిపోయాడని నిర్ధారించుకొని, అరుణ్ అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. మరోవైపు సుదీప్ మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అరుణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

MLA Sanjay Kumar: ఇదే నా ఆఖరి పోటీ.. మరోసారి ఛాన్స్ ఇవ్వండి

Show comments