Peddapalli: మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడులో నిన్న (సోమవారం) అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓడూరు-భూపాలపల్లి జిల్లా గుర్మిళ్లపల్లి మధ్య దూరాన్ని తగ్గించేందుకు మానేరు నదిపై 2016లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ కాంట్రాక్టర్ల మార్పు, నిధుల కొరతతో వంతెన నిర్మాణం ఆగిపోయింది. అయితే సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు వంతెన గర్డర్‌లు కూలిపోయాయి. ఇదిలా ఉండగా అర్ధరాత్రి వంతెన కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పగటిపూట రాకపోకలు సాగించే సమయంలో కూలిపోయి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పగటిపూట రాకపోకలు సాగించే సమయంలో వంతెన కూలిపోయి ఉంటే ప్రాణనష్టం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. వంతెన నిర్మాణం నాణ్యతపైనా విమర్శలు వస్తున్నాయి.
Read also: Khammam Crime: టీ కోసం పెళ్లి ఇంట ఘర్షణ.. బీరు సీసాలు, కర్రలతో దాడి.. చివర్లో ఊహించని ట్విస్ట్..!
పెద్దపల్లి జిల్లా ఓడేడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరాన్ని తగ్గించేందుకు వాగుపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. 2016 ఆగస్టు నెలలో రూ.49 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టర్ల మార్పు, నిధుల కొరత తదితర కారణాలతో నిర్మాణంలో జాప్యం జరుగుతుండడంతో స్థానికులు అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. పిల్లర్లు, కాలువల మధ్య బ్యాలెన్సింగ్ కోసం వేసిన చెక్క ముక్కలు దెబ్బతిన్నాయి. ఈ వంతెన నిర్మాణంలో భాగంగా గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి బీమ్‌లు సైతం కొట్టుకుపోయాయి. పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. ఇటీవల బ్రిడ్జిపై ఉన్న సిమెంటు కాలువలు కూలిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం నిర్మాణ పనుల వల్ల కూలిపోయిందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. కాంట్రాక్టుల్లో కమీషన్లు దండుకుంటున్న శ్రద్ద నిర్మాణ పనులపై చూపడం లేదని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
China floods: చైనాలో భారీ వర్షం.. నలుగురు మృతి, 10 మంది గల్లంతు..