NTV Telugu Site icon

Hyderabad Crime: అంబర్‌ పేటలో దారుణం.. పుట్టినరోజే పట్టాలపై..

Amberpet Crime

Amberpet Crime

Hyderabad Crime: అంబర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలుడు (16) ఘాటుకి దిగాడు. ప్రేమించాలంటూ ఓ అమ్మాయిపై కత్తితో దాడి చేసిన బాలుడు శవమై కనిపించాడు. విద్యానగర్‌ పట్టాలపై పోలీసులు అతని తల లేని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈరోజు రమణ పుట్టిరోజు అని తను ఇంత పని చేస్తాడని అనుకోలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఓ అమ్మాయిని రమణ అనే అబ్బాయి వేధించాడని బాధితురాలు ఆరోపించింది. తనను ప్రేమించలేదన్న కారణంతో గురువారం రాత్రి అంబర్ పేటలో బాలికపై అబ్బాయి దాడి చేశాడు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయురాలిపై కూడా నిందితులు దాడికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన తర్వాత రమణ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ తెల్లవారుజామున విద్యానగర్ పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి ట్యూషన్‌కు వెళ్లిన బాలికపై నిందితులు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయుడు దాడిని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ దాడిలో టీచర్‌తో పాటు బాలిక కూడా గాయపడింది.

ఈ ఘటనతో షాక్‌కు గురైన ఇతర విద్యార్థులు కేకలు వేశారు. స్థానికులు రావడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఉదయం స్థానికులు నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో వేధింపులు, అత్యాచారాలు, చిత్రహింసల విషయంలో ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా.. ఇలాంటి ఘటనలు మాత్రం తగ్గడం లేదని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు ఈ తరహా వేధింపులకు పాల్పడే వారిని మంచి మార్గంలో నడిపించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం లేకపోలేదు. జీవితంలో ప్రతి సమస్యకు మరణం ఒక్కటే పరిష్కారం కాదు. మీరు ఎప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే.. మీ జీవితంలో సహాయం కావాలంటే, వెంటనే అసరా హెల్ప్‌లైన్ ( +91-9820466726 ) లేదా ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు.
Mouni Roy: యువరాణిలాంటి అందాలతో మెరిసిపోతున్న మౌని రాయ్….!