NTV Telugu Site icon

Big Breaking: బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్..!

Begumpet

Begumpet

Big Breaking: బేగంపేట ఎయిర్‌ పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ లతో బేగంపేట్‌ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ మెయిల్ ద్వారా పోలీసులకు బాంబు సమాచారం అందడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు బాంబు బెదిరింపు సమాచారంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. బేగంపేట విమానాశ్రయానికి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరు మెయిల్ చేశారన్న పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఎయిర్ పోర్ట్ తో పాటు చుట్టూ ప్రాంతాన్ని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ క్షణ్ణంగ పరిశీలించన తరువాత బాంబు లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు వెనుతిరిగారు. అసలు బాంబు పెట్టారా లేక కొందరు ఆకతాయిలు మెయిల్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులకు బాంబు మెయిల్ రావడంతో.. విమానాశ్రయం వైపు ఎవరిని అనుమంతించడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read also: KTR: పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్!

గతంలో కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు, ప్రభుత్వ భవనాలు, స్థలాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేయగా అవి ఫేక్ కాల్స్ అని తేలింది. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో దేశంలోని పలు విమానాశ్రయాలకు ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో బాంబు లేదని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా, అలాంటి కాల్స్ మరియు మెయిల్స్ పంపినట్లయితే, తగిన చర్యలు తీసుకోబడతాయి.
Kalki 2898 AD : మధుర లో కల్కి థీమ్ సాంగ్ రివీల్..